‘అందాల రాక్షసి’తో మొదలుపెట్టి నటుడిగా చాలానే సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగా మారి తీసిన ‘చి ల సౌ’ అందరినీ ఆశ్చర్యపరిచింది.
తనలో ఇంత మంచి ఫిలిం మేకర్ ఉన్నాడా అనిపించేలా సున్నితమైన కథను హృద్యంగా నరేట్ చేసి ప్రశంసలు అందుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఐతే తనపై మంచి అంచనాలు నెలకొన్న సమయంలో అక్కినేని నాగార్జునతో తీసిన ‘మన్మథుడు-2’ మాత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
ఆపై చాలా గ్యాప్ తీసుకుని రాహుల్.. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తీస్తున్నాడు. అదే.. గర్ల్ ఫ్రెండ్. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా చేస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది.
ఓవైపు పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూనే రాహుల్‌తో చిన్న బడ్జెట్లో ఈ సినిమా చేస్తోంది రష్మిక. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే రాహుల్ ఇంకో సినిమాను ఓకే చేసుకున్నాడు.
మహేష్ బాబు బావ సుధీర్ బాబుతో రాహుల్ రవీంద్రన్ జట్టు కట్టబోతున్నాడు. వీరి కలయికలో సినిమా రాబోతున్న విషయంలో తాజాగా ఖరారైంది. తన కొత్త చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ ప్రమోషన్లలో భాగంగా సుధీర్ ఈ విషయం వెల్లడించాడు.
ప్రస్తుతం సుధీర్ ‘జటాధర’ అనే ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది ప్రి ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుంది. దీని తర్వాత రాహుల్ రవీంద్రన్‌తో తన సినిమా ఉంటుందని సుధీర్ తెలిపాడు.
ఈ కలయిక క్యూరియాసిటీ పెంచేదే. సున్నితమైన సినిమాలు తీసే రాహుల్.. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్న సుధీర్ బాబు కలయికలో ఎలాంటి సినిమా వస్తుందన్నది ఆసక్తికరం.
వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ఉంటుందట. ‘హరోంహర’తో పర్వాలేదనిపించిన సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రంతో ప్రేక్షకుల గుండెలు పిండేసేలాగే కనిపిస్తున్నాడు.
This post was last modified on October 8, 2024 10:29 am
"ఈ ఒక్క ఎన్నికల్లో చంద్రబాబును అడ్డుకుంటే చాలు. ఇక, 30 ఏళ్లపాటు మనకు తిరుగు ఉండదు" - అని వైసీపీ…
దక్షిణకొరియాలో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్…
వైసీపీ అధినేత జగన్కు 2024 భారీ షాకేనని చెప్పాలి. పార్టీ ఓటమి, కీలక నాయకుల జంపింగులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.…
దేశంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ సహా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు…
మరో సంవత్సరం ముగిసింది. కొత్త ఆశలతో స్వాగతం పలికేందుకు 2025 తయారయ్యింది. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రెస్…
జనసేన పార్టీ 2014లో ఆవిర్భవించినా.. ఆ తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా ప్రాధాన్యం లేకుండా…