Movie News

‘లింగా’ను రజినీనే చెడగొట్టారట

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో మంచి అనుబంధం ఉంది. వీరి కలయికలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. అవే.. ముత్తు, నరసింహా. ఈ రెండు సినిమాలు రజినీ కెరీర్లో ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే అలాంటి దర్శకుడితోనే ‘లింగ’ లాంటి డిజాస్టర్ మూవీ కూడా ఇచ్చాడు రజినీ.

ఐతే ఈ సినిమా ఫెయిల్యూర్‌కు ఎడిటింగ్‌లో రజినీ చేసిన తప్పిదాలు కారణమంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవికుమార్ చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. రజినీ పుట్టిన రోజైన డిసెంబరు 12న సినిమాను రిలీజ్ చేయాలన్న ఆతృతలో తాము అనుకున్న విధంగా సినిమాను తీర్చిదిద్దలేకపోయారని.. రజినీ చేసిన మార్పులు చేర్పుల వల్ల సినిమా పాడైపోయిందని.. అందుకే ఆశించిన ఫలితం రాలేదని రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘లింగ’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వరకు అంతా బాగానే అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. హడావుడిగా సినిమాను ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. బెలూన్ ఫైట్ అయితే ట్రోల్ మెటీరియల్‌ లాగా మారిపోయింది. ఇదంతా రజనీ వల్లే అన్నట్లు మాట్లాడాడు రవికుమార్. క్లైమాక్స్‌లో సీజీ షాట్స్‌తో భారీ సెటప్ పెట్టుకున్నామని.. కానీ రజినీ పుట్టిన రోజుకు సినిమా రిలీజ్ చేయాలని పట్టుబడడంతో ఆ వర్క్ పూర్తి కాలేదని రవికుమార్ చెప్పాడు.

క్లైమాక్స్ ముంగిట అనుష్క మీద మంచి పాట కూడా అనుకున్నామని.. కానీ అది రజినీనే తీయించేశాడని చెప్పాడు రవికుమార్. ఇంకో కీలకమైన ట్విస్ట్ ఉండే సీన్ కూడా తీసేశారని.. త్వరగా సినిమా పూర్తి కావాలన్న ఉద్దేశంతో బెలూన్ ఫైట్ పెట్టించారని.. మొత్తంగా సెకండాఫ్‌ను రజినీ గందరగోళంగా మార్చేశారని రవికుమార్ అన్నాడు. ఐతే రవికుమార్ సున్నితమైన టోన్‌లోనే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ రజినీ అభిమానులకు ఈ కామెంట్స్ నచ్చక ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.

This post was last modified on October 7, 2024 6:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వీర్ వారసుడొచ్చాడు..

క్రికెట్‌ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి…

13 mins ago

కంటెంట్ సినిమాల మినీ యుద్ధం

టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…

47 mins ago

చిరంజీవి అంటే అంత ఇష్టం – అల్లు అర్జున్

గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…

1 hour ago

2024 సంక్రాంతి.. మొత్తం దిల్ రాజే

సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…

3 hours ago

డాకు మహారాజ్ – ఎమోషన్ ప్లస్ రివెంజ్

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…

4 hours ago