ఒకప్పుడు తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే చక్కటి తెలుగు టైటిళ్లు పెట్టేవారు. మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు సినిమాల టైటిళ్లు తెలుగులోకి మార్చడానికి కూడా కష్టమైపోతోంది.
తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటూ నేరుగా తమిళ టైటిళ్లే పెట్టి రిలీజ్ చేస్తున్నారు. వలిమై అంటూ ఏమీ అర్థం కాని తమిళ టైటిల్ పెట్టి సినిమాను రిలీజ్ చేసినపుడే మనవాళ్లు నిరసన వ్యక్తం చేయాల్సింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు వరుసగా తమిళ టైటిళ్లతోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
రాయన్, కంగువ, వేట్టయాన్.. ఇలా వరుసగా తమిళ టైటిళ్లతోనే సినిమాలు వచ్చేస్తున్నాయి. కనీసం వేట్టయాన్‌ను వేటగాడు అని మార్చడానికి కూడా బద్దకం అయిపోయింది. రజినీకాంత్ లాంటి హీరో కూడా టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీనిపై ప్రేక్షకులూ బలంగా మాట్లాడట్లేదు. ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. ఇలాంటి టైంలో పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనే.. రచయిత అబ్బూరి రవి.
“తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమాలో, ఇతర భాషలలో ఉండే బోర్డు లని తెలుగులోకి చక్కగా మార్చేవారు. అది కూడా మానేసి విడుదల చేస్తున్నారు. వారి వారి భాషలలో వారి గొప్పదనాన్ని, కళాత్మకతని గౌరవిస్తాను. కానీ, తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవడం నచ్చట్లేదు. తెలుగుని గౌరవించని వాళ్ళని కూడా తెలుగువాళ్లు గౌరవించడం, ఆదరించడం, ఆ చిత్రాలని చూడ్డానికి మన డబ్బులు ఖర్చుపెట్టడం మన గొప్పతనం అని మాత్రం నేను అనుకోవట్లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో మంచి స్పందనే వస్తోంది. మరి ఈ విషయం తమిళ మేకర్స్, తమిళ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసే నిర్మాతల వరకు వెళ్లి మార్పు వస్తుందేమో చూడాలి.
This post was last modified on October 7, 2024 6:14 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…