రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని ట్విట్టర్‍లో యమ యాక్టివ్‍గా వుంటుంది. తెలుగు హీరోల భార్యలలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‍గా వుండేవారిలో ఉపాసనకు మొదటి స్థానం ఇవ్వవచ్చు. వైద్య రంగానికి చెందిన ఉపాసన సినిమా వాళ్లతో బాగానే స్నేహం చేస్తుంటుంది. సమంత అక్కినేనితో ఆమెకు మంచి స్నేహ సంబంధాలున్నాయి.
అయితే సమంతకు సంబంధించిన ఒక ఆర్టికల్ చదివి ఉపాసన చాలా గిల్టీగా ఫీలయిందట. ఇదే విషయాన్ని ట్విట్టర్‍లో షేర్ చేసుకుంది ఉపాసన. యువర్స్ లైఫ్‍లో న్యూట్రిషన్ గురించి సమంత రాసిన ఆర్టికల్ చదువుతుంటే చాలా గిల్టీగా అనిపించిందని, కాకపోతే ఆరోగ్యంగా జీవించడమనేది రాత్రికి రాత్రి జరిగే విషయం కాదు కనుక తనకు తాను సర్ది చెప్పుకుంటున్నానని చెప్పింది.
ప్లాంట్ బేస్డ్ డైట్‍కి సంబంధించి సమంత తీసుకున్న అప్రోచ్ చూసి స్ఫూర్తి పొందానని, ఏదో ఒక రోజు తన మాదిరిగా పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని సంతరించుకుంటాననే ధీమా వ్యక్తం చేసింది. హీరోల భార్యల మధ్య ఈ ఆరోగ్యకరమైన అనుబంధాన్ని చూసి అభిమానులు ముచ్చట పడుతున్నారు.
This post was last modified on September 30, 2020 10:21 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…