టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విషయంలో అయినా ఆచితూచి అడుగులు వేస్తారనే పేరు తెచ్చుకున్నారు. అంత తేలికగా ఎవరినీ నమ్మే నాయకుడు కూడా కారని పేరుంది. అయితే, ఆయన సాహసం చేసిన నమ్మిన వారిలో చాలా మంది నాయకులు ఆయనకు హ్యాండివ్వడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన కుటుంబం కాపు సామాజిక వర్గానికి చెందిన ఈలి ఫ్యామిలీ. ఈలి ఆంజనేయులు, వరలక్ష్మిలు తాడేపల్లి గూడెం నుంచి పలుమార్లు గెలుపు గుర్రం ఎక్కారు.
గతంలో ఈలి ఆంజనేయులు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, వీరి కుమారుడు ఈలి నాని విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. టీడీపీలో కీలకంగా ఈ కుటుంబంలో నాని బయటకు వచ్చి.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ తరఫున 2009లో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇంతవరకు సాఫీగానే సాగింది. కానీ, ప్రజారాజ్యం ఎప్పుడైతే.. కాంగ్రెస్‌లో విలీనం అయిందో.. అప్పుడు ఇక.. ఈలినానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రజారాజ్యంతో పాటు కాంగ్రెస్‌లోకి వెళ్లినా.. ఆయనను అక్కడ ఎవరూ పట్టించుకోలేదు.
దీంతో విధిలేని పరిస్థితిలో నాని మళ్లీ టీడీపీ గూటికి చేరారు. చంద్రబాబు.. యువకుడు, ఉత్సాహవంతుడు.. అంటూ గతాన్ని మరిచి పార్టీ కండువా కప్పారు. అయితే, 2014లో టీడీపీ తరఫున తాడేపల్లిగూడెం టికెట్‌ను ఆశించినా.. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో నాని సైలెంట్ అయ్యారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో యాక్టివ్‌గానే వ్యవహరించారు. ఈ పరిణామానికి తోడు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకపోవడంతో గత ఏడాది తాడేపల్లిగూడెం టికెట్‌ను చంద్రబాబు నానికే ఇచ్చారు. అయితే.. జగన్ సునామీ దెబ్బతో నాని ఓటమిపాలయ్యారు.
ఇక, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు వైసీపీ నాయకుడు, మంత్రి శ్రీరంగనాథరాజుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని జిల్లా నాయకులు చర్చించుకుంటున్నారు. నిజానికి ఈలి నానిని చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నారని, గత ఏడాది ఈ టికెట్ కోసం మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పట్టుబట్టినా.. ఆయనకు ఇవ్వకుండా నానికి ఇచ్చారని, అలాంటి నాని ఇలా చేయడం సరికాదని స్థానిక టీడీపీ సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on September 30, 2020 5:30 pm
ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ…
కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా…
పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య…
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…