Movie News

దర్శన్‌ను రేణుక స్వామి ఆత్మ వెంటాడుతోందట

ప్లాన్ చేసి చేశారో.. లేక క్షణికావేశంలో చేశారో కానీ.. కన్నడ కథానాయకుడు దర్శన్ తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించిన విషయం కొన్ని నెలల కిందట ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే.

కారణాలు ఏవైనా కానీ.. రేణుకస్వామిని దర్శన్ అండ్ కో హింసించిన తీరు ఘోరాతి ఘోరం. తన గాయాలు, అనుభవించిన చిత్రహింస గురించి మీడియాలో రాయలేనంత ఘోరం జరిగింది. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు పాలయ్యాడు.

ఇప్పటిదాకా ఈ కేసులో అతడికి బెయిల్ కూడా రాలేదు. ఐతే బెంగళూరు జైల్లో దర్శన్‌కు మంచి సౌకర్యాలు అందుతున్నాయని మీడియాలో వార్తలు రావడంతో కొన్ని వారాల కిందట బళ్లారి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

కాగా తనను బెంగళూరు జైలుకే మార్చాలని దర్శన్ అధికారులను కోరుతున్నాడట. తనకు బళ్లారి జైల్లో నిద్రే పట్టడం లేదని.. రేణుకాస్వామి ఆత్మ తన కలలోకి వచ్చి వెంటాడుతోందని జైలు అధికారులకు చెబుతున్నాడట.

తాను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నానని.. తనను బెంగళూరు జైలుకు తరలించాలని దర్శన్ అధికారులను వేడుకుంటున్నాడట. అర్ధరాత్రి సమయంలో దర్శన్ నిద్రలో కలవరిస్తున్నట్లు.. గట్టిగా కేకలు వేస్తున్నట్లు తోటి ఖైదీలు జైలు అధికారులకు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ కేసులో దర్శన్‌తో పాటు అతను ఎవరి కోసం అయితే రేణుక స్వామిని హత్య చేశాడో, ఆ పవిత్ర గౌడ.. మరో 13 మందిని నిందితులుగా చేర్చి రిమాండుకు తరలించారు పోలీసులు. ఇటీవలే ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా వేశారు.

ఇందులో హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరిస్తూ.. రేణుకస్వామి విపరీత ప్రవర్తన గురించి పోలీసులు పేర్కొన్నారు. మారు అకౌంట్లతో రేణుకస్వామి.. పవిత్రకు దారుణమైన మెసేజ్‌లు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

తాను నెలకు 10 వేల రూపాయలు ఇస్తానని.. తనతోనూ సహజీవనం చేయాలని రేణుకస్వామి.. పవిత్రకు మెసేజ్‌లు పెట్టినట్లు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. పవిత్ర వార్నింగ్ ఇచ్చినా వినకుండా ఇలాంటి మెసేజ్‌లే పెట్టి వేధిస్తుండడంతో ఆమె దర్శన్‌కు ఇవన్నీ చూపించడం.. అతను కోపోద్రిక్తుడై తన అనుచరులతో కలిసి రేణుకస్వామికి బుద్ధి చెప్పాలనుకోవడం.. ఈ క్రమంలో అతను హత్యకు గురి కావడం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

This post was last modified on October 5, 2024 9:45 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

7 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago