జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నడు. ఎంతోమంది దిగ్గజాలు తన నటనను కొనియాడారు. ఐతే దేశంలోనే మేటి నటుల్లో ఒకడిగా పేరున్న ప్రకాష్ రాజ్ లాంటి దిగ్గజం తారక్ నటనను కొనియాడితే.. తెలుగులో తనకు అత్యంత నచ్చిన నటుడు తారకే అని చెబితే అభిమానులు మహదానందానికి గురవుతారనడంలో సందేహం లేదు.
దేవర సక్సెస్ మీట్లో ప్రకాష్ రాజ్ ఇదే మాట చెప్పాడు. ఈ సందర్భఃగా తారక్ మీద తనకున్న ప్రేమ గురించి ఎవరికీ తెలియదన్నాడు చివరికి తారక్‌కు కూడా ఆ విషయం చెప్పలేదన్నాడు.
తారక్ మీద నాకెంత ప్రేమంటే.. అది ఎవరికీ చెప్పలేదు. తారక్‌తో కూడా చెప్పుకోలేదు. ఆ మధ్య ఆస్కార్ అవార్డుల వేడుక కోసం వెళ్లినపుడు అక్కడ అంతమంది గొప్ప గొప్ప నటుల ముందు నిలుచుని తారక్ మాట్లాడుతుంటే.. ఇంట్లో కూర్చుని వీడియో చూశాను. అప్పుడు నేనెంత గర్వించానో మాటల్లో చెప్పలేను.
తెలుగులో నాకు చాలామంది హీరోలు ఇష్టం. కానీ ఆ హీరోల్లో అత్యుత్తమ నటుడు ఎవరు అంటే తారకే. అలాంటి ఎనర్జిటిక్ నటుడు.. కొరటాల శివ కోసం అండగా నిలబడి దేవర లాంటి సినిమా తీయడాడనికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించడం గొప్ప విషయం అని ప్రకాష్ రాజ్ అన్నారు.
ఇదే ఈవెంట్లో పాల్గొన్న సీనియర్ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన కెరీర్లో ఉన్న ఒక అసంతృప్తిని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తీర్చారని చెప్పాడు. తాను ఎంతోమంది లెజెండరీ నటులు, సీనియర్లతో కలిసి సినిమాలు చేశానని.. కానీ పెద్ద ఎన్టీఆర్‌తో నటించలేదనే అసంతృప్తి మాత్రం ఉండిపోయిందని.. ఐతే అఖండలో బాలయ్యతో, ఇప్పుడు దేవరలో తారక్‌తో నటించడంతో ఆ బాధ తీరిపోయిందని శ్రీకాంత్ చెప్పాడు.
తాను తారక్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. తన జర్నీ అంతా తనకు తెలుసని.. ఎంతో కష్టపడడం వల్లే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఇంత గుర్తింపు తెచ్చుకున్నాడని.. భవిష్యత్తులో అతను ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
This post was last modified on October 5, 2024 11:20 am
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…