శాండల్ వుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరో ధృవ సర్జ. స్వయానా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. ఆ మధ్య పొగరు అనే డబ్బింగ్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న వెంట పడుతూ అల్లరి చేసే భారీకాయం గుర్తుందా. ఆ కుర్రాడు ఇతనే. పదకొండు భాషల్లో తీసుకొస్తున్న ప్యాన్ ఇండియా మూవీ మార్టిన్ వచ్చే వారం అక్టోబర్ 11 దసరా సందర్భంగా విడుదల కాబోతోంది. ప్రతి ఈవెంట్ లో ధృవ వెంటే ఉంటూ అర్జున్ ప్రమోషన్ల బాధ్యతను తీసుకున్నాడు. నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మార్టిన్గ్ బాగోకపోతే, నా టాలెంట్ నచ్చకపోతే ఇకపై ప్రోత్సహించకండి అంటూ ధృవ చెప్పడం ఆకట్టుకుంది.
ఇదంతా ఓకే కానీ అర్జున్ మేనల్లుడికి మార్కెట్ లో చాలా పెద్ద సవాల్ ముందుంది. ఒక రోజు ముందు అక్టోబర్ 10 సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీనికి ధృవ స్వంత రాష్ట్రం కర్ణాటకలోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు బయట మార్కెట్ల గురించి చెప్పాలా. ఇక తెలుగులో వేట్టయన్ పాటు ఇంకో నాలుగు సినిమాలు నువ్వా నేనాని కవ్విస్తున్నాయి. గోపీచంద్ విశ్వంకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండదండలు పుష్కలంగా ఉపయోగపడతాయి. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరోని యువి క్రియేషన్స్ దగ్గరుండి మరీ పబ్లిసిటీ పరంగా శ్రద్ధ తీసుకుంటోంది.
అలియా భట్ జిగ్రాని సురేష్ ఏషియన్ పంపిణి చేయడం వల్ల చెప్పుకోదగ్గ స్క్రీన్లు దొరుకుతాయి. ఇవి కాకుండా 12న సుహాస్ జనక అయితే గనకతో వస్తున్నాడు. దిల్ రాజు సంస్థ కాబట్టి ప్లానింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. వీటి మధ్య మార్టిన్ నెగ్గుకురావడం అంత సులభం కాదు. పాకిస్థాన్ వెళ్లిన ఒక భారతీయ యోధుడు చేసే అరాచకం మీద అర్జున్ స్వయంగా ఈ కథ రాశారు. అల్లుడి కోసం కాబట్టి కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. తెలుగులో పొగరు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ధృవ సర్జ ఆశలన్నీ మార్టిన్ మీదే ఉన్నాయి. మరి ఈ కండల వీరుడు పోటీని తట్టుకుని ఎలా నిలుస్తాడో చూడాలి.
This post was last modified on October 5, 2024 11:15 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…