మొత్తానికి ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న దాని కంటే మెరుగైన ఫలితం దిశగా దూసుకెళ్తోంది. కొంచెం మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తట్టుకుని తొలి వీకెండ్లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత కొంచెం డల్ అయినట్లు కనిపించింది. కానీ గాంధీ జయంతి రోజు సినిమా హౌస్ ఫుల్స్‌తో నడిచింది. తర్వాతి రోజు కొంచెం వసూళ్లు తగ్గినా.. పరిస్థితి నిరాశాజనకంగా అయితే లేదు.
దసరా సెలవులను బాగా ఉపయోగించుకుంటూ ప్రతి రోజూ చెప్పుకోదగ్గ షేరే రాబడుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ సెంచరీ కొట్టేయడం విశేషం. ఏపీ, తెలంగాణల్లో కలిపి ‘దేవర’ షేర్ రూ.100 కోట్ల మార్కును ఆల్రెడీ దాటేసింది. బుధవారం నాటికే ఈ సినిమా ఈ మార్కును అందుకుంది.
ఆరు రోజుల వ్యవధిలో ‘దేవర’ తెలుగు రాష్ట్రాల షేర్ రూ.110 కోట్లకు చేరువైంది. నైజాంలో రూ.42 కోట్ల మేర షేర్ రావడం విశేషం. సీడెడ్లో ఈ చిత్రం రూ.22 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. వైజాగ్‌లో రూ.11 కోట్లకు కాస్త ఎక్కువగా షేర్ వచ్చింది. ఏపీలోని మిగతా ఏరియాలన్నీ కలిపితే రూ.28 కోట్ల మేర షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ లెక్కలు చూస్తే ‘దేవర’ షేర్ రూ.200 కోట్లకు చేరువగా ఉండొచ్చు. గ్రాస్ వసూళ్లు రూ.300 కోట్లను దాటిపోయాయి. రెండో వీకెండ్లో కూడా సినిమా బాగా ఆడేలా కనిపిస్తోంది.
ఇటీవలే ‘దావూది రే’ పాటను యాడ్ చేశారు. దీని కోసం తారక్ ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు వస్తారనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బాగానే చూస్తున్నారు. రెండో వీకెండ్లో సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దసరా సినిమాలు వచ్చే వరకు ‘దేవర’కు ఢోకా లేనట్లే.
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…
ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న పెద్ద సినిమాల్లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు ఫ్యామిలీకి ఈ సినిమా ఎంత ప్రతిష్టాత్మకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన…
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…