కొత్త చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్న ఈ టైంలో దేశవ్యాప్తంగా ఒక సినిమా కోసం ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రమే.. లక్ష్మీబాంబ్. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాఘవ లారెన్స్ తెరకెక్కించిన చిత్రమిది. సౌత్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ ‘కాంఛన’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర హక్కులను కొన్ని నెలల కిందటే హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీపావళికి ‘లక్ష్మీబాంబ్’ పేలబోతోందని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తున్న నేపథ్యంలో ఆ టోర్నీ ముగింపు సమయంలో ‘లక్ష్మీబాంబ్’ను రిలీజ్ చేయనున్నారు. నవంబరు 9న ప్రిమియర్స్ పడనున్నాయి. అదే రోజు ఈ చిత్రం థియేటర్లలో కూడా రిలీజ్ కాబోతోంది.
ఐతే థియేటర్లు అప్పటికి తెరుచుకుంటాయా.. ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన సినిమాను థియేటర్లలో అదే రోజు రిలీజ్ చేయడమేంటి అని సందేహాలు కలగడం సహజం. కానీ ఆ చిత్రం థియేటర్లలో రిలీజయ్యేది ఇండియాలో కాదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మరికొన్ని దేశాల్లో. అక్కడ కొన్ని నెలల ముందే థియేటర్లు తెరుచుకున్నాయి. మామూలుగా నడుస్తున్నాయి. ఇప్పటికే అక్కడ హిందీ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ‘హాట్ స్టార్’తో ఒప్పందం జరిగే సమయంలోనే థియేటర్లు అందుబాటులో ఉన్న కొన్ని దేశాల్లో సినిమాను రిలీజ్ చేసుకునేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఇండియా కాకుండా బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న అమెరికా, మరికొన్ని దేశాల్లో మాత్రం నిర్ణీత గడువులోపు థియేటర్లలో రిలీజ్ చేయకూడదని హాట్ స్టార్ హామీ తీసుకుంది. బహుశా థియేట్రికల్ రిలీజ్ ఉన్న దేశాల్లో హాట్‌స్టార్‌లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండకపోవచ్చు.
This post was last modified on September 30, 2020 7:46 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…