మొన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ రేపిన వివాదం ఎంత దూరం వెళ్లిందో చూస్తున్నాం. నాగార్జున ముందు క్షమాపణ కోరడంతో ఆగుదామని ఆలోచించినా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటమే కాదు అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్ ని ఇరకాటంలో పెట్టేలా ఉండటంతో పరువు నష్టం దావా వేస్తూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నిజానికి ఇలా ఆధికార పార్టీ మినిస్టర్ మీద ప్రత్యక్ష యుద్ధానికి తలపడాల్సిన పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదనే చెప్పాలి. టాలీవుడ్ ముక్తకంఠంతో ఏకతాటిపైకొచ్చి ఈ సంఘటనను ఖండించగా అభిమానుల నుంచి నిరసన స్వరాలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
కోర్టుకు వెళ్లడం ద్వారా నాగార్జున ఏ స్థాయి న్యాయం దక్కించుకుంటారనేది తర్వాత తేలుతుంది కానీ ఇది మాత్రం సాహసోపేత నిర్ణయమే. తమ కుటుంబం దీన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో నాగ చైతన్య, అఖిల్ లు ట్వీట్ల రూపంలో వ్యక్తం చేస్తుండగా అమల సైతం సున్నిత పదాలు కాకుండా ఎండగట్టే రీతిలో ప్రశ్నించడం అభిమానుల నుంచి భారీ మద్దతు దక్కించుకుంది. చిరంజీవితో మొదలుపెట్టి విశ్వక్ సేన్ దాకా అందరూ నిరసనలో భాగం కావడమే కాక తమ గళాన్ని గట్టిగా విప్పుతున్నారు. ఇక్కడితో వివాదం ముగిద్దామని కాంగ్రెస్ పెద్దలు కోరినా అప్పటికే వ్యవహారం న్యాయస్థానం మెట్లు ఎక్కేసింది.
ఒకరకంగా ఇదీ మంచిదే. రాబోయే రోజుల్లో ఇష్టం వచ్చినట్టు సినిమా స్టార్ల మీద నోరు పారేసుకుని ముందు తగిన ఆధారాలు ఉన్నాయో లేదో రాజకీయ నాయకులు చెక్ చేసుకుంటారు. వాళ్లకు కోర్టులు, వాయిదాలు కొత్త కాకపోవచ్చు. తీర్పులు ఎన్నో చూసి ఉండొచ్చు. కానీ ఫాలోయింగ్ ఉన్న హీరోలతో తలపడితే వాళ్ళ అభిమానుల దృష్టి చులకన కావడమనేది భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అందుకే ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని, హెచ్చరికను ఈ ఉదంతం ఇచ్చింది. మరి వాద ప్రతివాదాలు, జడ్జిల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
This post was last modified on October 4, 2024 10:21 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…