ఇండియాలోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడిగా ఎదిగిన జానీ మాస్టర్.. గత నెలలో పెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన దగ్గర ఆరేళ్ల పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ అమ్మాయి.. తనపై తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు పెట్టడం సంచలనం రేపింది.
ఈ కేసు నమోదయ్యాక కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న జానీ.. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. బెయిల్ కోసం వెంటనే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐతే ఇప్పుడు జానీకి బెయిల్ లభించింది.
కానీ అది పూర్తి స్థాయి బెయిల్ కాదు. కేవలం నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది జానీకి కోర్టు. జాతీయ అవార్డుల వేడుకలో పాల్గొనాల్సి రావడమే ఇందుక్కారణం.
తమిళ చిత్రం ‘తిరు చిత్రాంబళం’కు గాను జానీ మరొక మాస్టర్‌తో కలిసి జాతీయ పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో ఇది అత్యున్నత అవార్డు. దీంతో తన పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. కానీ కొన్ని వారాలకే లైంగిక వేధింపుల కేసులో చిక్కుకుని జైలు పాలయ్యాడు.
ఇంతకుముందు బెయిల్ కోసం ప్రయత్నించినపుడు తిరస్కరించిన కోర్టు.. ఇప్పుడు జాతీయ అవార్డుల వేడుక కోసం జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకే ఈ బెయిల్ ఉంటుంది.
ఈ సమయంలో అతను ఢిల్లీకి వెళ్లి జాతీయ అవార్డుల వేడుకలో పాల్గొని వస్తాడు. ఐతే ఎంతో సంతోషంగా, గర్వంగా జాతీయ అవార్డుల వేడుకలో పాల్గొని పురస్కారం స్వీకరించాల్సిన జానీ.. ఇప్పుడీ కేసు మూలంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ వేడుకకు వెళ్తున్నాడు. తన జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అతను ఊహించి ఉండడు. ఈ కేసులో మున్ముందు అతనెలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.
This post was last modified on October 3, 2024 7:08 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…