దర్శకుడు శంకర్ కెరీర్ లోనే అతి పెద్ద మచ్చగా నిలిచిపోయిన ఆల్ టైం డిజాస్టర్ ఇండియన్ 2 తర్వాత దాని సీక్వెల్ కోసం ఎవరూ ఎదురు చూడటం లేదన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ లో విపరీతంగా నష్టపోయిన లైకా సంస్థ ఈ కారణంగానే వేట్టయన్ ని డిమాండ్ కన్నా తక్కువ రేట్ కి ఇచ్చుకోవాల్సి వచ్చిందట. 1996లో రిలీజైన మొదటి భాగం ఎంత బ్లాక్ బస్టర్ అయినా దాని మీద ఇప్పటి జనరేషన్ కి ఎంత మాత్రం ఆసక్తి లేదని ఓపెనింగ్స్ లోనే అర్థమైపోయింది. అనవసరంగా రిస్క్ చేసి వందల కోట్ల బడ్జెట్ పెట్టడంతో పాటు నాసిరకం కథాకథనాలు భారతీయుడు బ్రాండ్ ని దెబ్బ తీశాయి.
తాజాగా వినిపిస్తున్న షాక్ ఏంటంటే ఇండియన్ 3ని నేరుగా ఓటిటిలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే దిశగా లైకా మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టు చెన్నై టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ఈ వార్త కోలీవుడ్ మీడియాలో జోరుగా తిరుగుతోంది.
ఎందుకంటే కమల్ హాసన్ మణిరత్నంతో చేసిన తగ్ లైఫ్ 2025 వేసవిలో రిలీజ్ చేయబోతున్నారు. దానికన్నా ముందు ఇండియన్ 3 వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ తర్వాత ప్లాన్ చేద్దామా అంటే బడ్జెట్ మీద వడ్డీలు పెరిగిపోవడంతో పాటు ఓటిటితో చేసుకున్న ఒప్పందం ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ గోలంతా ఎందుకు లెమ్మని డైరెక్ట్ డిజిటల్ అనుకుని ఉండొచ్చు.
గేమ్ ఛేంజర్ ఎంత హిట్టయినా దాని ప్రభావం భారతీయుడు 3 మీద సానుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ట్రోలింగ్ కంటెంట్ గా మారిన సెకండ్ పార్ట్ మాములు నెగటివిటీ తీసుకురాలేదు. క్లైమాక్స్ విజువల్స్, కాజల్ అగర్వాల్ పాత్ర, సేనాపతి తండ్రిగా కమల్ మూడో పాత్ర, భారీ నిర్మాణం వగైరాలు థర్డ్ పార్ట్ కి సంబంధించి ఆసక్తికరంగా అనిపించాయి.
కానీ సగటు ప్రేక్షకులు మాత్రం ఇక చాలు అనుకునేలా రెండో భాగం విసుగు తెప్పించింది. అఫీషియల్ గా ప్రకటన వచ్చేదాకా ఖరారుగా చెప్పలేం కానీ ఒకవేళ నిజమైతే మాత్రం సంచలనమే అవుతుంది. ఎందుకంటే కమల్ ఇప్పటిదాకా డైరెక్ట్ ఓటిటిలో సినిమా చేయలేదు.
This post was last modified on October 3, 2024 7:22 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…