హిట్లకన్నా ఫ్లాపులే కన్నా ఎక్కువ చూసి సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్ అబ్బవరం ఆశలన్నీ త్వరలో విడుదల కాబోయే ‘క’ మీదే ఉన్నాయి. ఇది తన మొదటి ప్యాన్ ఇండియా మూవీ. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ థ్రిల్లర్ లో హీరో పాత్ర పోస్ట్ మ్యాన్.
ఒక గ్రామంలో జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ అదిరిపోయే ట్విస్టులు ఉంటాయని టీమ్ సభ్యులు అంటున్నారు. ఆ మధ్య వచ్చిన విరూపాక్షకు రెండింతల థ్రిల్స్ ఉంటాయని ఊరిస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన టీజర్, లిరికల్ సాంగ్ ప్రేక్షకులకు బాగానే రీచ్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ బాకీ ఉంది.
విశ్వసనీయ సమాచారం మేరకు ‘క’ ను అక్టోబర్ 31 థియేటర్లకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ టైంలో పోటీ బలంగా ఉంది. విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ముందే ప్రకటించారు కానీ ఇప్పుడు వాయిదా పడొచ్చనే టాక్ కిరణ్ కు సానుకూలంగా మారుతుంది. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ డేట్ మారకపోవచ్చు.
దానికి అనుగుణంగానే బాలయ్య ఆన్ స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్ లో టీమ్ పాల్గొంది. సత్యదేవ్ ‘జీబ్రా’ మెల్లగా ఆసక్తిని పెంచుతోంది. వెరైటీ కాన్సెప్ట్ తో పాటు భారీ తారాగణం, రవి బస్రూర్ సంగీతం లాంటి ఆకర్షణలు బజ్ తీసుకొస్తున్నాయి. శివ కార్తికేయన్ ‘అమరన్’ సైతం రేసులో ఉంది.
వీటి మధ్య ‘క’ తీసుకొస్తే ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. అయితే మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్ లు తప్పుకోవచ్చనే సమాచారం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తన సినిమాని సిద్ధం చేసి పెట్టుకునే ఆలోచనలో కిరణ్ అబ్బవరం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే నవంబర్ లో కంగువ వస్తుంది. తెలుగులోనూ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ ఛేంజర్ హడావిడికి ఎవరైనా తట్టుకోవడం కష్టం. అంతకన్నా ఆలస్యమైతే ‘క’కు లేనిపోని చిక్కు. సుజిత్ – సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ‘క’కు సామ్ సిఎస్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.
This post was last modified on October 3, 2024 7:02 pm
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…