సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా వేట్టయన్ అక్టోబర్ 10 దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. సూర్యతో జై భీం లాంటి క్లాసిక్ మూవీ ఇచ్చిన టీజె జ్ఞానవేల్ దీనికి దర్శకుడు. ఇవాళ ట్రైలర్ వచ్చేసింది. అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో తమిళంలో ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. తెలుగులోనూ మెల్లగా బజ్ పెరుగుతోంది. టైటిల్ మార్చకుండా యధాతథంగా దాన్నే ఉంచేయడం పట్ల బాషా ప్రేమికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే వేట్టయన్ కథ గుట్టు విప్పేశారు.
అమాయకులైన ఆడపిల్ల హత్య జరిగితే దానికి కారణమైన నిందితులు దొరక్కుండా తప్పించుకుంటారు. ఎలాగైనా పట్టుకోవాలనే ఒత్తిడి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్ మెంట్ మీదకు తీసుకొస్తుంది. దొరికితే ఊచలు లెక్కబెట్టించడం కాదు ఏకంగా ప్రాణాలే తీయాలనే సిద్ధాంతం వేట్టయన్ ది. దీంతో నేరస్థుల అంతు చూసేందుకు సిద్ధమవుతాడు. అయితే వాడిని పట్టుకుంటే చాలనే నిబంధనలు, కమిటీలు ఎన్ని అడ్డం వచ్చినా సరే ఆ దుర్మార్గుడి చివరి శ్వాస తీసేందుకు కంకణం కట్టుకుంటాడు. మధ్యలో వచ్చే అడ్డంకులు, ఊహించని పాత్రలు, మలుపులు వెరసి వేట్టయన్ స్టోరీగా చెబుతున్నారు.
ఇదంతా చూస్తుంటే 2019 హైదరాబాద్ లో జరిగిన దిశా సంఘటన గుర్తుకు వస్తోంది. ఒక డాక్టర్ యువతిని జాతీయ రహదారిపై అటకాయించి దారుణంగా అత్యాచారం చేయడమే కాక ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో అంతమొందించడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. రోజుల వ్యవధిలో నగర శివార్లలో నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేయడం గొప్ప సెన్సేషన్. ఈ ఆపరేషన్ కి నేతృత్వం వహించిన సజ్జనార్ జనం దృష్టిలో హీరో అయిపోయారు. ఆ తర్వాత మానవ హక్కుల విచారణ, ఇన్వెస్టిగేషన్ ఇదంతా వేరే కథ. వేట్టయన్ లో ఈ దారుణానికి సంబంధించిన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
This post was last modified on October 2, 2024 10:47 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…