కొత్త హీరోతో సినిమా చేసినప్పుడు దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. అందులోనూ బలమైన బ్యాక్ గ్రౌండ్ లేకపోతే పబ్లిక్ దాకా చేరడం పెద్ద సవాల్. టీవీ స్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా పరిచయమవుతున్న రాంనగర్ బన్నీ ఎల్లుండి విడుదల కాబోతోంది. మొదటి నుంచి తనను తాను యాటిట్యూడ్ స్టార్ గా ప్రమోట్ చేసుకుంటున్న చంద్రహాస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాడు కానీ సగటు ప్రేక్షకుల దాకా చేరలేకపోతున్నాడు. టీవీ సీరియల్స్ విపరీతంగా చూసే మహిళలు కొత్త సినిమాల గురించి అంత ఎక్కువ పట్టించుకోరు. ఈ అంశం సన్నాఫ్ ప్రభాకర్ మీద ప్రభావం చూపిస్తోంది.
అందుకే వీలైనంత హైలైట్ అయ్యేందుకు ఏం చేయాలో అంతా చేస్తున్నాడు చంద్రహాస్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కొచ్చిన రామ్ గోపాల్ వర్మ ముందు తన యాటిట్యూడ్ ని ప్రదర్శించాడు. పలు ఇంటర్వ్యూలలో పెద్ద హీరోల అభిమానులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వాపస్ చేస్తానని, ఇన్స్ టాలో టికెట్ కొన్నట్టు ఆధారం, థియేటర్ ఫోటో పెడితే గూగుల్ పే చేస్తానని శపథం చేశాడు. గతంలో ఇలాంటి హామీలు బోలెడంత మంది ఇచ్చారు కానీ నిజంగా అమలు చేసిన వాళ్ళు లేరు. చంద్రహాస్ ఏం చేస్తాడో.
ఇవన్నీ ఎలా ఉన్నా చివరిగా మాట్లాడాల్సింది కంటెంట్. దేవర సునామి రెండో వారంలోనూ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీవిష్ణు స్వాగ్ లాంటి క్రేజీ పోటీని తట్టుకుని నిలవడం రాంనగర్ బన్నీకి అంత సులభం కాదు. ఏదో అల్లు అర్జున్ పేరుని టైటిల్ గా వాడుకున్నంత మాత్రాన జనాలు వచ్చేయరు. ఒకప్పుడు పెద్ద సినిమాలకు పని చేసిన రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఇప్పుడు శ్రీనివాస్ మహత్ గా పేరు మార్చుకుని రాంనగర్ బన్నీతో దర్శకుడిగా మరోసారి లక్కును పరీక్షించుకుంటున్నాడు. డైరెక్టర్ గా గతంలో చేసినవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మరి చంద్రహాస్ డెబ్యూతో ఋజువు చేసుకుంటాడేమో చూడాలి.
This post was last modified on October 2, 2024 10:36 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…