Movie News

బాల‌య్య దిగి వ‌చ్చాడ‌ట‌గా..

ఐదుకు ఐదు సినిమాల‌తోనూ స‌క్సెస్‌లు కొట్టి చాలా త‌క్కువ స‌మ‌యంలోనే టాప్ డైరెక్ట‌ర్ల లీగ్‌లోకి చేరాడు అనిల్ రావిపూడి. ఐదో సినిమాకే అత‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో జ‌ట్టు క‌ట్టాడు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ని రీతిలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందించాడు. మ‌హేష్‌తో సినిమా చేశాక అంత‌కంటే ఎక్క‌డానికి ఏం మెట్లు ఉంటాయి అనుకుంటాం?

కానీ ప్ర‌స్తుతం మ‌హేష్ మార్కెట్లో మూడో వంతు కూడా లేని నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేయాల‌న్న ఆశ‌తో అనిల్ ఉండ‌టం విశేషం. స‌రిలేరు.. రిలీజ్ టైంలో ఓ టీవీ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ తాను సినిమా చేయాల‌నుకునే హీరోల్లో బాల‌య్య ఒక‌డ‌ని.. ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి ఇంత‌కుముందు చేసిన ప్ర‌య‌త్నాలు కొన్ని కార‌ణాల వ‌ల్ల ఫ‌లించ‌లేద‌ని.. భ‌విష్య‌త్తులో క‌చ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు అనిల్.

ఐతే ఇంత‌కుముందు అనిల్ త‌న‌తో రామారావు అనే సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే బాల‌య్య ఓకే చేయ‌లేదు. అత‌డికి అవ‌కాశ‌మివ్వ‌లేదు. కానీ ఇప్పుడు బాల‌య్య ఆలోచ‌న మారింద‌ని.. అనిల్‌తో ప‌ని చేయ‌డానికి త‌నే రాయ‌బారం పంపాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం బాల‌య్య‌.. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

లాక్ డౌన్ కార‌ణంగా ఆ సినిమా షూటింగుకి బ్రేక్ ప‌డింది. మ‌ళ్లీ ప‌ని మొద‌లైతే ఇంకో మూడు నెల‌ల్లో సినిమా పూర్తి కావ‌చ్చు. ఆ త‌ర్వాత ఏ సినిమా చేయాల‌నే విష‌యంలో బాల‌య్య‌కు క్లారిటీ లేదు. పూరి జ‌గ‌న్నాథ్‌తో సినిమా అంటున్నారు కానీ.. ప‌క్కా ఏమీ కాదు.

ఐతే ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు బాగా దూర‌మైపోయిన నేప‌థ్యంలో అనిల్‌తో ఓ ఎంట‌ర్టైన‌ర్ చేస్తే బాగుంటుంద‌ని బాల‌య్య భావిస్తున్నాడ‌ని.. ఇద్ద‌రి మ‌ధ్య సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని.. ఎఫ్‌-3 త‌ర్వాత అనిల్ బాల‌య్య‌తోనే సినిమా చేయొచ్చ‌ని అంటున్నారు.

This post was last modified on April 28, 2020 12:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆగకుండా ఆగమాగం చేస్తున్న దురంధర్

దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…

6 hours ago

సహానా సహానా… అంచనాలు అందుకున్నానా

రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…

7 hours ago

షర్మిలకు బాబు, పవన్, లోకేష్ విషెస్… మరి జగన్?

చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…

9 hours ago

‘సింపతీ కార్డ్’పై నాగవంశీ కౌంటర్

సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…

11 hours ago

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…

11 hours ago

కొత్త రిలీజుల తాకిడి… అవతారే పైచేయి

అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…

12 hours ago