తెలుగు సినిమాల్లో కామెడీకి అత్యున్నత స్థాయి తీసుకొచ్చిన కొత్త తరం దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకడు. అతను కేవలం కామెడీ ప్రధానంగా సినిమాలు తీయలేదు కానీ.. వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాల్లో హైలైట్ అయింది మాత్రం కామెడీనే.
తన సినిమాల్లో వేరే అంశాలు కూడా ఉన్నప్పటికీ.. కామెడీ వల్లే అవి పెద్ద హిట్లయ్యాయి. ఐతే ‘దూకుడు’తో వినోదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన వైట్ల.. ఆ తర్వాత గాడి తప్పాడు. తన సినిమాలకు ప్లస్ అవుతూ వచ్చిన కామెడీ ట్రాకులే తర్వాత ప్రేక్షకులకు విసుగు పుట్టించాయి.
ఐతే తన కామెడీ ఎక్కడ తిరగబడిందో తనకు లేటుగా తెలిసిందని అంటున్నాడు వైట్ల. తన చివరి చిత్రాల్లో కామెడీ పండకపోవడానికి కారణం ప్రేక్షకులకు మొనాటనీ వచ్చేయడమే అని అంగీకరించాడు. ఓ ఇంటర్వ్యూలో తన కామెడీ ఫెయిలవడం గురించి అతను మాట్లాడాడు.
“నేను తీసినవి కామెడీ సినిమాలు కావు. కానీ చాలా సినిమాల్లో కామెడీ హైలైట్ అయింది. బాగా వర్కవుట్ అయింది. నాకు ‘ప్లే’ చేయడం చాలా ఇష్టం. హీరో కామెడీ క్యారెక్టర్లను వాడుకుని అందరితో ఆటాడుకోవడం బావుంటుంది. నేనీ కామెడీ బాగా డీల్ చేయగలను. చాలా సినిమాల్లో ఈ ప్లే హిలేరియస్‌గా వర్కవుట్ అయింది. నన్ను చూసి వేరే దర్శకులు కూడా ఇన్‌స్పైర్ అయి ఇలాంటి కామెడీ ట్రై చేశారు. ఒక దశాబ్దం పాటు ఈ తరహా కామెడీ బాగా వర్కవుట్ అయింది. కానీ నాతో పాటు అందరూ దీన్ని ఎక్కువ వాడేయడంతో ప్రేక్షకులకు ఒక దశ దాటాక మొనాటనీ ఫీలింగ్ వచ్చింది. హీరో ఒక ఇంట్లోకి వెళ్లి ఇలాంటి ప్లేతో కామెడీ చేయడం రొటీన్ అయిపోయింది. అందుకే ఒక దశ దాటాక ఈ కామెడీ వర్కవుట్ కాలేదు. నా సినిమాలు కొన్ని ఫెయిలవడానికి కూడా ఇదే కారణం. ఐతే ఇప్పుడు నేను ఆ తప్పు చేయలేదు. ‘విశ్వం’ సినిమా కోసం కొత్త థీమ్ తీసుకుని నా నుంచి ఆశించే కామెడీ ట్రాక్ పెట్టాను. ఇందులో ట్రైన్ నేపథ్యంలో వచ్చే అరగంట కామెడీ ట్రాక్ హిలేరియస్‌గా వచ్చింది. కానీ దీనికి ‘వెంకీ’కి పోలిక లేదు’’ అని వైట్ల తెలిపాడు.
This post was last modified on October 2, 2024 4:31 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…