సినిమా రంగంలో సక్సెస్ రేట్ ఎప్పుడూ తక్కువే. ఏడాది మొత్తం రిలీజయ్యే సినిమాలు.. వాటి ఫలితాలను లెక్కగట్టి చూస్తే విజయవంతమైన చిత్రాలు పది శాతానికి మించవు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు లేక, రిలీజైన వాటిలో కూడా ఆడినవి తక్కువ కావడంతో తొలి ఆరు నెలలు నిరాశాజనకంగా గడిచాయి.
‘హనుమాన్’, ‘డీజే టిల్లు’ మినహాయిస్తే థియేటర్లను కళకళలాడించిన సినిమాలు లేవు. ద్వితీయార్దంలో ‘కల్కి’ మూవీ గొప్ప ఉపశమనాన్ని అందించింది. దాని తర్వాత తరచుగా ఓ చిన్న సినిమా థియేటర్లలో సందడిని తీసుకొస్తోంది. ఆగస్టు 9న వచ్చిన ‘కమిటీ కుర్రాళ్ళు’ మంచి ఫలితాన్నందుకుంది. ఆగస్టు 15న విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ నిరాశ పరిచినా.. అదే వీకెండ్లో రిలీజైన ‘ఆయ్’ మూవీ సూపర్ హిట్ అయింది.
ఇక ఆగస్టు నెలాఖర్లో నాని మూవీ ‘సరిపోదా శనివారం’ వర్షాల దెబ్బను కూడా తట్టుకుని మంచి వసూళ్లు రాబట్టింది. తర్వాతి వారం ఓ మంచి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే.. 35: చిన్న కథ కాదు. దీని స్థాయిలో ఇది థియేటర్లలో బాగానే ఆడింది.
ఆ తర్వాతి వారానికి ‘మత్తు వదలరా-2’ బాక్సాఫీస్‌ను ఆదుకుంది. కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాలో సత్య కామెడీ బాగా వర్కవుట్ కావడంతో మంచి వసూళ్లు వచ్చాయి. రెండో వీకెండ్లో కూడా ఈ సినిమా అదరగొట్టింది.
మధ్యలో చిన్న గ్యాప్ తర్వాత సెప్టెంబరు నెలాఖర్లో ‘దేవర’ హంగామా మొదలైంది. ట్రైలర్ చూసి ఈ సినిమా ఫలితం మీద సందేహాలు వ్యక్తం చేశారు కానీ.. ఆ నెగెటివిటీని సినిమా బాగానే తట్టుకుంది. టాక్ అంత గొప్పగా లేకపోయినా మంచి వసూళ్లు రాబట్టింది తొలి వారంలో.
ఇప్పుడు దసరా సెలవుల అడ్వాంటేజీతో రన్‌ను కొసాగిస్తోంది. ఈ వారం రాబోతున్న ‘శ్వాగ్’ ఆశాజనకంగా కనిపిస్తోంది. తర్వాత దసరా సినిమాల సందడి మొదలవుతుంది. మొత్తంగా ప్రస్తుతం సినిమాల సక్సెస్ రేట్ పెరిగి నిలకడగా హిట్లు పడుతుండడంతో థియేటర్ల పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది.
This post was last modified on October 2, 2024 4:23 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…