Movie News

తండ్రి సూపర్ హిట్ స్ఫూర్తితో కూతురి సినిమా

కొన్ని కాకతాళీయంగా జరిగినా వాటి వెనుక సంగతులు ఆసక్తికరంగా ఉంటాయి. వచ్చే వారం అక్టోబర్ 11 ఆర్ఆర్ఆర్ ఫేమ్ అలియా భట్ జిగ్రా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రేక్షకులనూ మెప్పిస్తుందనే కారణంతో తెలుగులో డబ్బింగ్ చేసి సురేష్ ఏషియన్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు.

విశ్వం, జనక అయితే గనక, వేట్టయన్, మా నాన్న సూపర్ హీరో లాంటి స్ట్రెయిట్ మూవీస్ తో పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో పెద్ద రిస్కు చేస్తున్నారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన జిగ్రాకి ఎప్పుడో 1993లో వచ్చిన ఒక సూపర్ హిట్ తో కనెక్షన్ ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు.

ముప్పై ఏళ్ళ క్రితం అలియా భట్ తండ్రి మహేష్ భట్ డైరెక్షన్లో గుంరా వచ్చింది. శ్రీదేవి, సంజయ్ దత్ హీరో హీరోయిన్లు కాగా రాహుల్ బోస్ విలన్ గా నటించాడు. విదేశాల్లో అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న శ్రీదేవిని ప్రాణాలకు తెగించి జైలు నుంచి తప్పించి సంజయ్ దత్ ఇండియాకు తీసుకొస్తాడు. మోసం చేసి దీనికి కారణమైన వాడి అంతు చూడటమే గుంరాలో మెయిన్ పాయింట్.

ఇక జిగ్రా విషయానికి వస్తే ఇక్కడ అక్కా తమ్ముడిని తీసుకున్నారు. ఫారిన్ లో అన్యాయంగా కేసులో ఇరుకున్న తమ్ముడి కోసం రక్తం పంచుకుని పుట్టిన సోదరి ఎంత దూరమైనా వెళ్లే కథతో వాసన్ జిగ్రా రాసుకున్నారు.

ట్రీట్ మెంట్, స్క్రీన్ ప్లే, బ్యాక్ డ్రాప్ వేరుగా ఉండొచ్చు కానీ సారూప్యతని మాత్రం కొట్టి పారేయలేం. తండ్రి తీసిన బ్లాక్ బస్టర్ ని ఇన్స్ పిరేషన్ గా తీసుకుని ఒక స్టోరీ రాస్తే అందులో మూడు దశాబ్దాల తర్వాత కూతురు నటించడం అనూహ్యమే.

ట్విస్ట్ ఏంటంటే గుంరా నిర్మించిన ధర్మా ప్రొడక్షన్స్ సంస్థే ఇప్పుడు జిగ్రాలో నిర్మాణ భాగస్వామిగా ఉండటం. సో తెలిసే ప్లానింగ్ జరిగి ఉండొచ్చు. హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం విస్తృతంగా ప్రమోషన్లు చేశారు. ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జిగ్రా విత్ దేవర అనే ఇంటర్వ్యూ కూడా తీశారు. జిగ్రా కోసం అలియా చాలా కష్టపడింది.

This post was last modified on October 2, 2024 4:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైలెట్ శారీలో వయ్యారాలు వలకబోస్తున్న అవికా..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇటు సినిమాలు అటు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి అవికా గోర్ .చిన్నారి…

15 mins ago

ఇంటివాడు కాబోతున్న అఖిల్….ఎవరీ జైనబ్

అక్కినేని ఇంట్లో నాగచైతన్య పెళ్లి బాజాలు వచ్చే వారం మ్రోగబోతున్న తరుణంలో నాగార్జున మరో శుభవార్త పంచుకున్నారు. అఖిల్ ఓ…

2 hours ago

13 ఏళ్ల వైభవ్.. ఎందుకు సెలెక్ట్ చేశామంటే: రాహుల్ ద్రవిడ్

ఐపీఎల్ మెగా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రికెట్ వరల్డ్ లో…

2 hours ago

ఆల్ ఇండియా టాప్ 1 పారితోషికం బన్నీదే!

మాములుగా స్టార్ హీరోల రెమ్యునరేషన్లు బహిర్గతంగా బయటికి చెప్పరు. మీడియాకు దొరికిన సోర్స్ నుంచి ప్రపంచానికి వెల్లడి చేయడం ఎప్పుడూ…

3 hours ago

విషాదంగా ముగిసిన కులశేఖర్ పాట

గీత రచయిత కులశేఖర్ ఇవాళ అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్ను మూశారు. సినిమా పాటల సాహిత్య ప్రియులకు ఈయన పరిచయం…

3 hours ago

పుష్ప-2 పాట.. ఇక్కడ కన్నా అక్కడ హిట్టు

‘పుష్ప: ది రైజ్‌’తో పోలిస్తే ‘పుష్ప: ది రూల్’ పాటలు అంచనాలకు తగ్గట్లు లేవన్న అభిప్రాయాలు మెజారిటీ జనాల్లో ఉన్నాయి.…

4 hours ago