టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీ అంటే.. ‘హిట్’ అనే చెప్పాలి. మనకు పెద్దగా పరిచయం లేని, కలిసి రాని ఫ్రాంఛైజీ సినిమాల ఒరవడిని ‘హిట్’తో బాగా అలవాటు చేశాడు యువ దర్శకుడు శైలేష్ కొలను. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో నడిచే ‘హిట్’, ‘హిట్-2’ రెండూ మంచి విజయం సాధించాయి.
ఇప్పుడు ఈ చిత్రాల నిర్మాత నానినే హీరోగా మారి ‘హిట్-3’ చేస్తుండడంతో మూడో మూవీ మీద అంచనాలు బాగా పెరిగాయి. పైగా నాని దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాక చేస్తున్న మూవీ ఇది.
ఇటీవలే చిత్రీకరణ ఆరంభమైన సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ నాని అభిమానులకు గూస్ బంప్స్ తెచ్చింది. శైలేష్ దర్శకత్వ ప్రతిభ, నాని స్టార్ పవర్ తోడైతే ఈ సినిమా లెవెలే వేరుగా ఉంటుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ‘హిట్-3’ చకచకా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాకు కథానాయికను కూడా ఖరారు చేశారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నేచురల్ స్టార్‌తో జోడీ కడుతుండడం విశేషం. ‘కేజీఎఫ్’ అంత పెద్ద హిట్టయినా.. శ్రీనిధికి చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు.
విక్రమ్ సరసన తమిళంలో ‘కోబ్రా’ మూవీ చేసింది. కానీ అది నిరాశపరిచింది. తెలుగులో కొంచెం లేటుగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’లో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా ఫలితమేంటో చూడాలి. ఇప్పుడు నాని సినిమాలో ఛాన్స్ రావడం శ్రీనిధి కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు.
‘హిట్’ సిరీస్‌లో తొలి రెండు చిత్రాల్లో మాదిరే ఇందులోనూ హీరో పోలీస్ ఆఫీసరే. అర్జున్ సర్కార్ అనే వయొలెంట్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించనున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించే అవకాశముంది.
This post was last modified on October 2, 2024 4:23 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…