ఒక కమర్షియల్ సినిమాని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టడంలో ఇప్పుడున్న వాళ్లలో అనిరుధ్ రవిచందర్ తర్వాతే ఎవరైనా. విక్రమ్, జైలర్, మాస్టర్ ఇలా ఏదీ తీసుకున్నా యావరేజ్ బొమ్మని సైతం పదిరెట్లు ఎలివేషన్లతో బ్లాక్ బస్టర్ చేసిన ఘనత తనది.
దేవర కోసం అనిరుధ్ ని తీసుకున్నప్పుడు టైంకి వర్క్ పూర్తి చేస్తాడా, తమిళంలో ఇచ్చినట్టు తెలుగులో బీజీఎమ్ చేయగలడా అంటూ రకరకాల అనుమానాలు తలెత్తాయి. వాటిని పటాపంచలు చేస్తూ తారక్, కొరటాల శివ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎంత గొప్ప స్కోర్ ఇచ్చాడో థియేటర్ సాక్షిగా చూశాం. ఇక నాని కనెక్షన్ ఏంటో చూద్దాం.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీకి అనిరుధ్ రవిచందర్ నే లాక్ చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ దాదాపు ఖరారు అయ్యిందట. అయితే ఈ కలయిక కొత్త కాదు.
నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ కు అనిరుదే కంపోజర్. కొన్ని మంచి పాటలు ఇచ్చాడు కానీ ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ కాలేకపోయాయి. సబ్జెక్టు పరంగా అవి డిఫరెంట్ జానర్స్ కాబట్టి ఎలివేషన్లకు చోటు లేకుండా పోయింది. కానీ శ్రీకాంత్ ఓదెల ఆ టైపు కాదు. దసరాలో నానిని గూస్ బంప్స్ వచ్చే స్థాయిలో ప్రెజెంట్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.
ఇప్పుడీ వార్త నిజమైతే సరిపోదా శనివారంలో నాని అన్నట్టు థియేటర్లకు వచ్చే అభిమానులు మొత్తం పోతారు. ఆ స్థాయిలో సౌండ్ బాక్సులు దద్దరిల్లిపోతాయి. బీజీఎమ్ లో తిరుగు లేకుండా దూసుకుపోతున్న అనిరుధ్ ఈసారి నాని మాస్ అవతారాన్ని ఏ రేంజులో లేపుతాడో వేరే చెప్పాలా.
వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న నాని – ఓదెల 2కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. హిట్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్న నాని దాన్ని త్వరగా పూర్తి చేసుకుని జనవరి నుంచి ఓదెల సెట్లో అడుగు పెట్టే అవకాశాలున్నాయి. క్యాస్టింగ్ ఎంపిక, ప్రొడక్షన్ ప్లానింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
This post was last modified on October 2, 2024 2:56 pm
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…