Movie News

కార్తి ‘తెలుగు’ ప్రేమ.. వేరే లెవెల్

తమిళ కథానాయకుల మీద తెలుగు ప్రేక్షకులు చూపించే అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటితరం లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్‌లను తెలుగు టాప్ స్టార్లతో సమానంగా ట్రీట్ చేశారు. వారి చిత్రాలకు అద్భుతమైన ఫలితాలను అందించారు. వారి తర్వాత సూర్య, కార్తి, ధనుష్, విజయ్.. ఇలా చాలామంది తమిళ స్టార్లను తెలుగు ప్రేక్షకులను నెత్తిన పెట్టుకున్నారు. వీళ్లందరిలో కార్తి చాలా ప్రత్యేకం అని చెప్పాలి.

సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఏ రోజూ అన్న ఛాయల్లో ఉండకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఆవారా’ సినిమాతో అతడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ‘యుగానికి ఒక్కడు’ కూడా అప్పట్లో తెలుగులో చాలా బాగా ఆడింది.

ఐతే అనుకోకుండా వచ్చిన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి కార్తి పెట్టిన ఎఫర్ట్ అభినందనీయం. కొత్త తరం హీరోల్లో కార్తి అంత బాగా తెలుగులో ఇంకెవ్వరూ మాట్లాడలేరు. ఈ విషయంలో సూర్య కూడా వెనుకబడిపోయాడు.

తెలుగు మీద బాగా పట్టు సాధించి తన ప్రతి చిత్రానికీ అతను తెలుగులోనే డబ్బింగ్ చెబుతున్నాడు. గతంలో కొంత తమిళ వాసన గుప్పుమనేది కానీ.. ఈ మధ్య తన తెలుగు స్పష్టంగా ఉంటోంది. వేరే భాషకు చెందిన హీరో అనే ఫీలింగ్ కలగట్లేదు. కార్తి కొత్త చిత్రం ‘సత్యం సుందరం’లో పాత్రకు తగ్గట్లు గడుసుదనం, అమాయకత్వం చూపిస్తూ ఒక డిఫరెంట్ డిక్షన్‌తో డైలాగులు చెప్పాడు కార్తి.

సినిమా చూసిన వాళ్లందరూ అతను డబ్బింగ్‌ మీద పెట్టిన శ్రద్ధను గుర్తిస్తున్నారు. అలాగే సినిమాలో తెలుగు పేర్లు, బోర్డులే ఉండేలా.. తెలుగు ప్రాంతాలు కనిపించేలా పెట్టిన ఎఫర్ట్ కూడా అభినందనీయం. ఇక ‘సత్యం సుందరం’ సినిమాను రిలీజ్‌కు ముందు, తర్వాత ప్రమోట్ చేస్తున్న తీరు కూడా తెలుగు ప్రేక్షకుల పట్ల అతను చూపించే శ్రద్ధకు నిదర్శనం. అందుకే కార్తి మీద తెలుగు ప్రేక్షకుల ప్రేమ కూడా ప్రత్యేకమైంది. ‘సత్యం సుందరం’ సినిమాకు ఇక్కడ మంచి స్పందనే వస్తోంది.

This post was last modified on October 2, 2024 12:14 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

1 hour ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

10 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago