Movie News

దేవర-2.. ఎప్పుడు?

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ‘దేవర’ సినిమా ఎట్టకేలకు గత శుక్రవారం రిలీజైపోయింది. ట్రైలర్ చూశాక సినిమా ఫలితం మీద చాలా సందేహాలు కలిగాయి కానీ.. ఉన్నంతలో ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే సాధించేలా ఉంది. సినిమాకు గొప్ప టాక్ రాలేదు.

అదే సమయంలో బాలేదు అనే టాక్ కూడా వినిపించలేదు. రిలీజ్‌కు ముందు ఉన్న హైప్, బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులు కలిసొచ్చి ఈ చిత్రం వీకెండ్లో భారీ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ అయ్యాక వసూళ్లు కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయినప్పటికీ.. గాంధీ జయంతి, దసరా సెలవులు కలిసి రానుండడంతో బాక్సాఫీస్ గండాన్ని గట్టెక్కేస్తుందనే అనుకుంటున్నారు.

సినిమా బ్రేక్ ఈవెన్ కావచ్చు. లేదా బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయటపడవచ్చు. మొత్తానికి ‘దేవర’ రిలీజైంది. సానుకూల ఫలితాన్నే అందుకుంటోంది. మరి ‘దేవర-2’ సంగతేంటి? అదెప్పుడు వస్తుంది? అసలు వస్తుందా రాదా అనే చర్చ జరుగుతోందిప్పుడు.

ఏదైనా సినిమాను రెండు భాగాలుగా తీయాలి అనుకున్నపుడు కొందరు రెండో పార్ట్ కూడా కొంత చిత్రీకరణ చేస్తారు. కొందరు తర్వాత చూసుకుందాం అనుకుంటారు. కొందరేమో ముందే రెండో భాగం కూడా తీసేస్తారు. ‘దేవర’ విషయంలో రెండో భాగం చిత్రీకరణ మొదలే కాలేదని సమాచారం.

పార్ట్-1 కోసం తీసిన సన్నివేశాలనే కొంత ఎడిట్ చేసి రెండో భాగం పెట్టుకున్నారట కానీ.. కొత్తగా ఇంకో సినిమా తీసినట్లే అన్నీ చేసుకోవాల్సి ఉంది. ఐతే తారక్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాలు చేయాల్సి ఉంది. ‘వార్-2’ ఆల్రెడీ కొంత చిత్రీకరణ జరుపుకుంది. నీల్ మూవీ త్వరలోనే మొదలవుతుంది.

ఇవి కాకుండా ‘దేవర-2’కు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ‘దేవర-1’ రిలీజ్ తర్వాత రిజల్ట్ సహా అన్నీ చూసుకునే పార్ట్-2 చేయాలని టీం భావించింది. రిజల్ట్ తేడా కొడితే రెండో భాగం ఆపేసేవారేమో. కానీ ఇప్పుడు పార్ట్-2 చేయడానికి తగ్గ ఫలితమే వచ్చేలా ఉంది. తారక్ ఖాళీ లేడు కాబట్టి మధ్యలో కొరటాల వేరే సినిమా ఒకటి చేసి.. 2026లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టే అవకాశముంది. 2027 లేదా 2028లో ఈ చిత్రం విడుదల కావచ్చు.

This post was last modified on October 2, 2024 12:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

38 శాతం ఓట్ షేర్ కూడా పోయేలా ఉంది జగన్!

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…

10 hours ago

నా తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా?..లోకేష్ ఫైర్

మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…

10 hours ago

రఘురామతో రాజీకి వచ్చిన సాయిరెడ్డి

వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…

13 hours ago

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న శ్రీరెడ్డి

వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…

14 hours ago

ఏపీకి రాందేవ్‌-ర‌విశంక‌ర్‌: బాబుకు మంచి సిగ్న‌ల్స్ ..!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవ‌లం ఐదు మాసాలు మాత్ర‌మే పూర్త‌యింది. కానీ,…

16 hours ago

ఆమిర్‌తో పైడిప‌ల్లి.. సాధ్య‌మేనా?

వంశీ పైడిప‌ల్లికి యావ‌రేజ్ డైరెక్ట‌ర్ అని పేరుంది. అత‌ను గొప్ప సినిమాలేమీ తీయ‌లేదు. కానీ.. అత‌ను కెరీర్లో ఇప్ప‌టిదాకా పెద్ద…

16 hours ago