Movie News

గోపీ-వైట్ల.. నిజంగా రేసులో ఉన్నారా?

ఇటు హీరో గోపీచంద్‌కు.. అటు దర్శకుడు శ్రీను వైట్లకు కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. విశ్వం. ఎప్పుడో పదేళ్ల కిందట ‘లౌక్యం’తో సక్సెస్ అందుకున్నాడు గోపీచంద్. తర్వాత తన ప్రతి చిత్రం నిరాశనే మిగిల్చింది. ‘సీటీమార్’ ఒక్కటి ఓ మోస్తరుగా ఆడింది తప్ప.. మిగతావన్నీ డిజాస్టర్లే.

ఇక వైట్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. ‘బాద్‌షా’ యావరేజ్‌‌గా ఆడాక అన్నీ డిజాస్టర్లే ఇచ్చాడు. కెరీర్లో చాలా ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఎంతో కష్టపడి ‘విశ్వం’ మూవీని లైన్లో పెట్టాడు. షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 11న రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని వారాల కిందట ప్రకటించారు. కానీ ఆ అప్‌డేట్ తర్వాత టీం నుంచి సౌండ్ లేదు. దసరాకు ఫిక్సయిన డబ్బింగ్ మూవీ ‘వేట్టయాన్’తో పాటు స్ట్రెయిట్ మూవీస్ మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక వాటి స్థాయిలో అవి ప్రమోషన్లు చేసుకుంటున్నాయి. కానీ ‘విశ్వం’ నుంచే సౌండ్ లేదు.

అసలే ఫ్లాప్‌ల మీద ఉన్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. బజ్ తక్కువగా ఉంది. అలాంటపుడ పబ్లిసిటీ కొంచెం గట్టిగా చేసి.. ఆసక్తికర ప్రోమోలు రిలీజ్ చేసి బజ్ పెంచే ప్రయత్నం చేయాలి. కానీ టీం మాత్రం సైలెంటుగా ఉంటోంది. ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి ప్రమోషన్ పట్టించుకోవట్లేదా.. లేక దసరాకు తమ చిత్రాన్ని రిలీజ్ చేసే ఉద్దేశం లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.

దసరాకు రావట్లేదంటే ఆ టైంలో పోటీ ఎక్కువ అని అయినా అనుకుని ఉండాలి లేదా సినిమాను అప్పటికి రెడీ చేయలేక వెనక్కి తగ్గుతుండాలి. మరి ప్రస్తుత సైలెన్స్‌కు కారణమేంటో చూడాలి. దసరాకు వచ్చేట్లయితే మాత్రం వీలైనంత త్వరగా ప్రమోషన్ మొదలుపెట్టాల్సిందే. ఇంకో రెండు మూడు రోజులు ఇదే సైలెన్స్ కొనసాగితే ‘విశ్వం’ దసరా రేసు నుంచి తప్పుకున్నట్లు భావించాలి. అదే జరిగితే టాలీవుడ్ దసరా మరింతగా కళ తప్పబోతున్నట్లే.

This post was last modified on October 1, 2024 1:26 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago