హరిహర వీరమల్లు ఏళ్ల తరబడి తీసి చివరికి దర్శకత్వ బాధ్యతను వేరొకరికి అప్పగించాల్సి వచ్చిన క్రిష్ అనుష్కతో తీస్తున్న ఘాటీని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే తొంభై శాతం దాకా షూటింగ్ పూర్తయ్యిందంటే షాకే. త్వరలోనే చివరి షెడ్యూల్ ని ఒడిశాలో పూర్తి చేయబోతున్నారు. దీంతో గుమ్మడికాయ కొట్టేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేసి, విడుదల తేదీకి ప్రణాళిక వేసుకుంటారు. ఒకవేళ వీరమల్లు కన్నా ముందు ఇది రిలీజైనా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంత పక్కాగా ప్రణాళిక ఉంది కాబట్టే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క ఘాటీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిజానికి క్రిష్ స్పీడ్ గురించి తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి పీరియాడిక్ డ్రామాని భారీ బడ్జెట్ తో అతి తక్కువ టైంలో తీయడం చూసి ఆ క్వాలిటీని రాజమౌళే మెచ్చుకున్నాడు. అందుకే బాలకృష్ణ కోరిమరీ ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతను అప్పజెప్పారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఘాటీ యాక్షన్ కం రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. మాఫియా టచ్ తో అనుష్కని గతంలో ఎన్నడూ చూడని సరికొత్త పాత్రలో క్రిష్ చూపించబోతున్నాడని వినికిడి. కేవలం సబ్జెక్టు వినే సెట్స్ కు వెళ్ళడానికి ముందే అమెజాన్ ప్రైమ్ ఒప్పందం చేసుకుందంటే కంటెంట్ లో ఎంత బలముందో అర్థం చేసుకోవచ్చు.
ఆఫర్లు ఎన్ని వస్తున్నా మెల్లగా అడుగులు వేస్తున్న అనుష్క మళ్ళీ కొత్త కమిట్ మెంట్ ఎవరికీ ఇవ్వలేదు. భాగమతి 2 గురించి బయట ప్రచారం జరగడమే తప్పించి ఇంకా స్క్రిప్ట్ వగైరా లాక్ కాలేదు. సో ప్రకటన వచ్చే దాకా ఖచ్చితంగా చెప్పలేం. ఓ ప్రోగ్రాంలో తమన్ చూచాయగా చెప్పాడు తప్పించి కన్ఫర్మ్ అనలేదు. ఘాటీని వేసవిలో తీసుకొచ్చే అవకాశాలున్నాయి. తమిళ హీరో విక్రమ్ ప్రభుతో పాటు జగపతి బాబు, చైతన్యరావు, రవీంద్ర విజయ్, విటివి గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఘాటీ అనుష్కకి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది. ఫ్యాన్స్ కోరుకునేది అదేగా.
This post was last modified on October 1, 2024 10:43 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…