Movie News

ఆ లిస్టులో తారక్ పేరు చేరినట్లేనా?

‘బాహుబలి’ సాధించిన అసాధారణ విజయం చూశాక అందరికీ అలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయాలని.. మార్కెట్‌ను విస్తరించాలని కోరిక కలిగింది. కానీ అందరికీ అది సాధ్యపడలేదు. అసలు ప్రభాస్ కూడా పాన్ ఇండియా మార్కెట్‌ను నిలబెట్టుకుంటాడా అన్న సందేహాలు కూడా కలిగాయి. ‘సాహో’ సినిమా నిరాశపరిచినప్పటికీ ఉత్తరాదిన మంచి వసూళ్లు రాబట్టింది. కానీ రాధేశ్యామ్ ప్రభాస్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఆదిపురుష్’ సైతం కొంత నెగెటివ్ ఎఫెక్ట్ చూపించింది. కానీ సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ తనకు తిరుగులేదని చాటుకున్నాడు.

ఇక టాలీవుడ్ టాప్ హీరోల్లో ఉత్తరాదిన మంచి మార్కెట్ సంపాదించింది అంటే.. అల్లు అర్జునే. అతడి ‘పుష్ఫ’ సినిమా నార్త్ ఇండియాలో సర్ప్రైజ్ హిట్ అయింది. ‘పుష్ప-2’ కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఉత్తరాదిన మంచి గుర్తింపే సంపాదించినట్లు కనిపించారు. ఐతే వాళ్ల సోలో సినిమాలు వస్తేనే మార్కెట్ ఏమేర క్రియేట్ అయింది అనేది తెలుస్తుందని అంతా భావించారు. ముందుగా తారక్ నుంచి ‘దేవర’ వచ్చింది.

ఈ సినిమాకు రిలీజ్ ముంగిట ఉత్తరాదిన పెద్దగా బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే సాగాయి. కానీ తొలి రోజు ఈ సినిమాకు హిందీలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. శని, ఆదివారాల్లో కూడా సినిమా బలంగా నిలబడింది. వీకెండ్లో రూ.30 కోట్ల గ్రాస్ సాధించి తారక్ నార్త్ స్టామినాను రుజువు చేసింది. సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఉత్తరాదిన తారక్ మంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాన్నది స్పష్టమైంది. హిందీలో నేరుగా ‘వార్-2’ చేస్తున్నాడు కాబట్టి తారక్ మార్కెట్ ఇంకా బలపడడం ఖాయం. అలాగే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నాడు కాబట్టి అక్కడ పెద్ద స్టార్‌గా అవతరించే అవకాశాలున్నాయి.

This post was last modified on September 30, 2024 9:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ డైరీలో పేజీలు ఫుల్

దేవర విజయాన్ని ఆస్వాదిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఇచ్చిన కమిట్ మెంట్లు మూడు. మొదటిది వార్ 2. ఇది జనవరి…

55 mins ago

ప‌వ‌న్ – స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు ఎక్కింది..!

అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్‌! అంటుంది 'స‌నాత‌న ధ‌ర్మం'. అతిగా ఏ విష‌యంపైనా స్పందించ‌కూడ‌ద‌నేది ఈ ధ‌ర్మం చెబుతున్న మాట‌. అంతేకాదు..…

3 hours ago

అమ్మ చెప్పిన ‘కళ్యాణ్ కబుర్లు’

ఏదైనా సినిమా రిలీజ్ టైంలోనో ఇంకో సందర్భంలోనో మీడియా ముందు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల గురించి పొడి పొడిగా రెండు మూడు మాటలు…

3 hours ago

జ‌గ‌న్ ప్ర‌భుత్వ కుర్చీలు దొంగిలించాడు: లోకేష్

కొత్త సీసాలో పాత సారా! అనే సామెత‌ను వైసీపీ, టీడీపీలు మ‌రోసారి నిరూపిస్తున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితా లు వ‌చ్చిన జూన్…

3 hours ago

కళ్యాణ్ రామ్ పంట పండుతోంది

నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఒకప్పుడు ఎలాంటి సాహసాలు చేశాడో తెలిసిందే. తన కెరీర్ ప్రమాదంలో పడ్డ సమయంలో ‘అతనొక్కడే’…

4 hours ago

ఎవరు పెద్ద హీరో.. సురేష్ బాబు కామెంట్స్

టాలీవుడ్లో నంబర్ల గేమ్ గురించి ఎప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అభిమానులు ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా…

5 hours ago