Movie News

చైతు…విష్ణు…ఎదురుచూపులాట

టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల ప్యాన్ ఇండియా సినిమాలకు విడుదల తేదీ సెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారింది. నాగ చైతన్య తండేల్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతూ కొలిక్కి వస్తోంది. ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద తర్జన భర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 లేదా 25 ఫిక్సవుతోంది కాబట్టి ఆ వారం వదిలేయాల్సిందే. దానికన్నా ముందు ఆరున పుష్ప 2 ఉంటుంది కనక ఆ ఛాన్స్ లేదు. అక్కినేని అభిమానులు ఎలాగూ నాగార్జున పండగ సినిమా లేదు కాబట్టి సంక్రాంతికి తండేల్ ని వదలమని డిమాండ్ చేస్తున్నారు. విశ్వంభరతో తలపడేందుకు అల్లు అరవింద్ ఇష్టపడరు.

ఇక మంచు విష్ణు కన్నప్పది ఇదే సమస్య. ఆ మధ్య పోస్టర్ లో డిసెంబర్ రిలీజన్నారు కానీ డేట్ సంగతి తేల్చలేకపోయారు. అచ్చం చైతు టీమ్ తరహాలోనే వీళ్లూ ఆలోచిస్తున్నారు. దాని వల్లే పూర్తి స్థాయి ప్రమోషన్లు ఇంకా మొదలుకాలేదు. సోలో రిలీజ్ చేసుకుంటే ఎక్కువ రీచ్ ఉంటుందనేది మంచు బృందం ఆలోచన. భక్తి పూర్వక చిత్రం కాబట్టి కమర్షియల్ సినిమాలతో పోటీ పడటం అనవసరమైన రిస్కవుతుంది. అందుకే పుష్ప, గేమ్ ఛేంజర్ ఎవరూ తప్పుకున్నా ఆ స్లాట్ లో రావాలనేది కన్నప్ప ప్లాన్. కానీ ఎవరికి వారు ధీమాగా వాయిదా ప్రసక్తే లేదన్న తరహాలో పలు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.

ఈ సస్పెన్స్ అంతా డిసెంబర్, జనవరి మధ్యే తిరుగుతోంది. తండేల్ నిర్మాత బన్నీ వాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ సినిమాని ఎక్కువ కాలం హోల్డ్ చేసి పెట్టలేమని తేల్చి చెప్పారు. ఓటిటితో చేసుకున్న ఒప్పందం కూడా కారణం కావొచ్చు. అందుకే ఇవాళ నుంచి పబ్లిసిటీ ప్లాన్ మొదలుపెట్టారు. నాగచైతన్య, సాయిపల్లవి మీద షూట్ చేసిన శివుడి జాతర పాట తాలూకు స్టిల్స్ ని ఫ్యాన్స్ కోసం వదిలారు. ఇక క్రమం తప్పకుండా కన్నప్ప లో నటిస్తున్న క్యారెక్టర్ల పరిచయం జరుగుతోంది కానీ రిలీజ్ మ్యాటర్ తేలడం లేదు. మంచు విష్ణు మాత్రం తొందరపడే ఉద్దేశంతో ఎంత మాత్రం లేడు.

This post was last modified on September 30, 2024 3:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago