దేవర కన్నా ఒక రోజు ఆలస్యంగా విడుదలైన సత్యం సుందరంకు తెలుగులోనూ మంచి పబ్లిక్ టాక్ వచ్చింది. రివ్యూలలో అరుదుగా వచ్చే త్రీ రేటింగ్ సైతం దక్కిందంటే కంటెంట్ ఎంతగా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే దేవర హోరులో కార్తీ, అరవింద్ స్వామిలు చేస్తున్న సౌండ్ జనాలకు పెద్దగా వినిపించడం లేదు. పంపిణి చేసింది సురేష్ ఏషియన్ సంస్థలే అయినప్పటికీ హైదరాబాద్ లో మంచి రిలీజ్ వచ్చేలా చేసుకున్నారు కానీ చాలా బిసి సెంటర్లలో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్క్రీన్లే దక్కలేదు. చిన్న కేంద్రాల్లో అసలు రిలీజే కాలేదు. దీంతో ఆడియన్స్ కి దేవర తప్ప మరో ఆప్షన్ కనిపించకుండా పోయింది.
ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమోషన్స్ ని హైలైట్ చేస్తూ మూడు గంటల సేపు దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సత్యం సుందరంని నడిపించిన తీరు ఫ్యామిలీ జనాలను బాగా ఆకట్టుకుంటోంది. ఇంత లెన్త్ ఉన్నప్పుడు సహజంగా వచ్చే ల్యాగ్ ఇందులోనూ వచ్చింది కానీ ఫైనల్ గా బయటికి వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్ ఇవ్వడంలో ఫెయిల్ కాలేదు. ముఖ్యంగా కార్తీ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. అవతలివాడు ఏమనుకుంటున్నాడు అనేది పట్టించుకోకుండా గలగలా మాట్లాడే పాత్రలో మాములుగా జీవించలేదు. ఒకపక్క నవ్విస్తూనే ఇంకోవైపు ఎమోషన్లతో ఆడుకుంటూ గుండెలు పిండేలా చేయడం తనకు మాత్రమే చెల్లింది.
పికప్ ఉన్నప్పటికీ ఇంకా మెరుగ్గా ఉండాల్సిన మాట వాస్తవం. సెప్టెంబర్ 28 కాకుండా ఒక వారం ఆలస్యంగా సత్యం సుందరం వచ్చి ఉంటే బాగుండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తమిళ వెర్షన్ ముందే వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు. గతంలో కాంతార కన్నడలో రిలీజైన రెండు వారాల తర్వాత తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చారు. రెస్పాన్స్ లో ఏం తేడా రాలేదు. కలెక్షన్లు హోరెత్తిపోయాయి. సత్యం సుందరంకు అదే స్థాయిలో కాకపోయినా ఇప్పుడున్న దానికన్నా పరిస్థితి బెటర్ గా ఉండేది. అక్టోబర్ 4 శ్రీవిష్ణు స్వాగ్ తప్ప వేరే కొత్త సినిమాలు లేవన్న సంగతిని గుర్తు పెట్టుకోవాల్సింది.
This post was last modified on September 30, 2024 10:10 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…