Movie News

అసలు సవాల్ ఇప్పుడు మొదలయ్యింది

మొదటి వీకెండ్ ని దేవర బ్రహ్మాండంగా ముగించాడు. దాదాపు అన్ని చోట్ల భారీ కలెక్షన్లతో థియేటర్లు కళకళలాడేలా చేశాడు. రెండు ప్రభుత్వాలు భారీ టికెట్ రేట్ల పెంపుకి అనుమతినివ్వడం పెద్ద నెంబర్లు వచ్చేలా చేసింది. ఎంత జూనియర్ ఎన్టీఆర్ హీరో అయినా అంత ధరని ఒప్పుకుని ప్రేక్షకులు సినిమా చూశారంటే కంటెంట్ గురించి చెప్పుకోదగ్గ టాక్ బయటికి వెళ్లడం వల్లే. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అసలు సవాల్ ఇవాళ సోమవారం నుంచి మొదలవుతుంది. సాధారణంగా ఎంత స్టార్ హీరో అయినా సరే వీక్ డేస్ లో డ్రాప్స్ ఉంటాయి. అది ఎంత శాతం అనే దాన్ని బట్టి బ్లాక్ బస్టర్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది.

ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం సీడెడ్ లాంటి ప్రాంతాల్లో బలంగా ఉన్న దేవర గోదావరి జిల్లాల్లో నెమ్మదించాడు. ఇది సండే బుకింగ్స్ లోనే కనిపించడంతో సోమవారం నుంచి సాధారణ రేట్లకు టికెట్లు అమ్మాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ లో తొలి రెండు రోజులు మహా దూకుడు చూపించిన తారక్ అక్కడా స్లో అయ్యాడు. నైజామ్ సేల్స్ బాగున్నా ఇదే జోరు ఏ మేరకు కొనసాగుతుందనేది వేచి చూడాలి. ఎల్లుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవు దినం కలెక్షన్ల పరంగా ప్లస్ కానుండగా స్కూళ్ళు, కాలేజీలకు ఈ వారం నుంచే దసరా సెలవులు రావడం చాలా పెద్ద ప్లస్.

కల్కి 2898 ఏడిని చూసుకుంటే పదిహేను రోజులకి పైగా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. బుక్ మై షో టాప్ ట్రెండింగ్ లో దుమ్ము దులిపింది. అలాంటి మద్దతు దేవర కనక ఆడియన్స్ నుంచి అందుకుంటే రికార్డులు చెల్లాచెదురు కావడం ఖాయం. ఒకవేళ సెకండాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగా యునానిమస్ గా బాగుందనే టాక్ తెచ్చుకుని ఉంటే ఇప్పుడీ విశ్లేషణ అవసరం ఉండేది కాదు. కానీ మిక్స్డ్ టాక్ రావడం ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్ లోనే సక్సెస్ మీట్ జరగబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ పరంగా అది బూస్ట్ లాగా పని చేస్తుందని టీమ్ భావిస్తోంది. చూడాలి దేవర స్పీడ్ ఎలా ఉండబోతోందో.

This post was last modified on September 30, 2024 10:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

51 minutes ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

56 minutes ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

2 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

2 hours ago

ఏమిటీ ‘అనుచితాల’.. ఆపండి: బీజేపీపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్ర‌హం!

బీజేపీ మాతృ సంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌).. తాజాగా క‌మ‌ల నాథుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు…

3 hours ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

4 hours ago