‘దేవర’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా సరే.. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం తొలి రోజు ఈ చిత్రం రూ.172 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వాస్తవంగా అంత కాకపోయినా 140-150 కోట్ల మధ్య గ్రాస్ వచ్చి ఉంటుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. ఐతే రెండో రోజు వసూళ్లలో అనుకున్నట్లే డ్రాప్ కనిపించింది. వసూళ్లు సగానికి పైగానే తగ్గాయి. ఈ సినిమాను విస్తృత స్థాయిలో రిలీజ్ చేయడం.. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ బొమ్మ పడడం.. పైగా రోజుకు ఆరు షోలు నడవడంతో సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్లలో చాలామంది తొలి రోజే చూశారు. టాక్ డివైడ్‌గా ఉండడంతో సామాన్య ప్రేక్షకుల్లో రెండో రోజుకు ఆసక్తి తగ్గింది. కానీ సినిమా డౌన్ అయితే కాలేదు. కలెక్షన్లు నిలకడగానే ఉన్నాయి. ఆదివారం వసూళ్లు పికప్ అయ్యాయి.
ఐతే మిగతా ఏరియాల సంగతేమో కానీ.. కొన్ని చోట్ల మాత్రం ఈ చిత్రం సూపర్ హిట్ రేంజిని అందుకునేలా ఉంది. అమెరికాలో ‘దేవర’ వసూళ్లు అంచనాలను మించిపోయాయి. వీకెండ్ అయ్యేసరికి 4 మిలియన్ మార్కును టచ్ చేస్తుందని అనుకుంటే.. శనివారమే ఆ మార్కును టచ్ చేసేసింది. ఆదివారానికి వసూళ్లు 5 మిలియన్ మార్కుకు చేరువ కానున్నాయి. వీకెండ్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోబోతోంది. తర్వాత వచ్చేవన్నీ లాభాలే.
ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. తొలి రోజు ఏడున్నర కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు 9 కోట్లకు వసూళ్లను పెంచుకోవడం విశేషం. తొలి రోజు తర్వాత వేరే చోట్ల వసూళ్లు డ్రాప్ అయితే.. హిందీలో మాత్రం ఇంకా మెరుగవడం విశేషం. దీన్ని బట్టి సినిమా హిందీ మాస్ ప్రేక్షకులకు బాగా ఎక్కేస్తోందని అర్థం. నార్త్ ఇండియాలోని సెకండ్ గ్రేట్ సెంటర్లలో సినిమాకు ఫుల్స్ పడుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదివారం హిందీ వెర్షన్ రూ.15 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక్కడ కూడా సినిమా సూపర్ హిట్ రేంజిని అందుకోనున్నట్లే.
This post was last modified on September 29, 2024 9:43 pm
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…