మాములుగా టాలీవుడ్ దసరాకు స్టార్ హీరోల సినిమాలు రావడం సహజం. సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే సీజన్ కావడంతో వీలైనంత ఈ అవకాశాన్ని వాడుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తారు. కానీ ఈసారి టయర్ 1 హీరోలెవరూ లేరు. అలాని పోటీ ఏం లేదని కాదు. పుష్కలంగా ఉంది. ముందుగా అక్టోబర్ 10 బరిలో దిగుతున్న రజనీకాంత్ ‘వేట్టయన్’ మీద తెలుగులో మరీ భారీ అంచనాలేం లేవు కానీ జైలర్ లాగా సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ అవుతుందేమోననే నమ్మకంతో అభిమానుల్లో ఉంది. డబ్బింగ్ వెర్షన్ అయినా చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు దక్కబోతున్నాయి. అందరికంటే ముందు రావడం అడ్వాంటేజ్.
11న అసలు జాతర ఉంది. గోపీచంద్ ‘విశ్వం’ ఇంకా బజ్ పెంచుకోవాల్సి ఉంది. దర్శకుడు శీను వైట్ల ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినా చాలా కాలంగా సక్సెస్ లేని కారణంగా ఆయన బ్రాండ్ పెద్దగా పని చేయడం లేదు. సో భారమంతా పబ్లిసిటీ మీదే ఉంది. దాన్ని పెంచుకునేలా ట్రైలర్లు, పాటలు కట్ చేస్తున్నారు. ఎంత వైవిధ్యం ట్రై చేసినా సక్సెస్ అందని ద్రాక్షగా మిగిలిపోయిన సుధీర్ బాబు ఈసారి ఎమోషనల్ గా ఆకట్టుకునేందుకు ‘మా నాన్న సూపర్ హీరో’తో వస్తున్నాడు. భావోద్వేగాలు బలంగా ఉండే ఈ ఫ్యామిలీ డ్రామాకు యువి సంస్థ బ్యాకప్ ఉండటం రిలీజ్ పరంగా మంచి ప్లస్ కానుంది.
కన్నడ హీరో ధృవ సర్జ ‘మార్టిన్’ని ఏకంగా పదకొండు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. వయొలెంట్ యాక్షన్ బలంగా దట్టించారు. ఇవి చాలదు అన్నట్టు అలియా భట్ బాలీవుడ్ మూవీ ‘జిగ్రా’ని తెలుగు డబ్బింగ్ చేసి అదే రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక 12న సుహాస్ ‘జనక అయితే గనక’ని దిల్ రాజు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. బడ్జెట్ పరంగా చిన్న చిత్రమే అయినప్పటికీ బలగం లాగా కంటెంట్ మీద ఆధారపడిన మూవీ కావడంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. త్రిప్తి డిమ్రి నటించిన ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ అదే రోజు రానుంది.
This post was last modified on September 28, 2024 6:07 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…