పుష్ప 2 విడుదలకు కేవలం ఇంకో అరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉన్నా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేకుండా బ్యాలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ని దర్శకుడు సుకుమార్ పరుగులు పెట్టిస్తున్నారు. చివరి నిమిషంలో ఇదేమైనా వాయిదా పడుతుందేమోనని ఆశతో కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు ముందు జాగ్రత్త చర్యగా తమ ఫైనల్ కట్స్ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాయి. కన్నప్ప లాంటి ప్యాన్ ఇండియా మూవీ సైతం ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తోంది. ఒకవేళ పుష్ప 2 కనక తప్పుకుంటే ఆ తేదీని ఎగరేసుకుపోవడానికి ఎదురు చూస్తున్న లిస్టు పెద్దదే.
ఇక అసలు టాపిక్ చూస్తే నిన్న దేవర పార్ట్ 1 ఓపెనింగ్స్ అదిరిపోయాయి. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన ప్రకారమే 172 కోట్ల గ్రాస్ అంటే మాటలు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద నెంబర్. ఇక్కడ పుష్పకు కనెక్షన్ ఏంటో చూద్దాం. దేవరకు రిలీజ్ కు ముందు బాలీవుడ్ వర్గాల్లో ఏమంత క్రేజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా జరిగాయి. కానీ మొదటి రోజు టాక్ వచ్చాక డైరెక్ట్ కౌంటర్ బుకింగ్స్ ద్వారా జరిగిన అమ్మకాలు ఎక్కువ కావడంతో ఎనిమిది కోట్ల దాకా వసూలయ్యింది. నార్త్ ట్రేడ్ వర్గాలు ఇది మంచి మొత్తమని అభిప్రాయపడు వీకెండ్ లో బాగా పికప్ ఉంటుందని భావిస్తున్నాయి.
పుష్ప 2 కేసు అలా కాదు. ముందు నుంచే నార్త్ ట్రేడ్ లో ఈ సినిమా హాట్ కేక్ లా ఉంది. పుష్ప 1 ఇచ్చిన హైప్ వల్ల హిందీ ప్రేక్షకులు అందులోనూ మాస్ ఆడియన్స్ లో బోలెడంత బజ్ ఉంది. సో సరైన ప్రమోషన్, ట్రైలర్ కట్ తో కనక వాళ్ళను ఆకట్టుకుంటే కేవలం ఉత్తరాది మార్కెట్ నుంచే మొదటి రోజు పాతిక కోట్లకు పైగా నెంబర్ చూడొచ్చు. మైత్రి మేకర్స్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు దేవరకోస్తున్న స్పందన చూశాక రెట్టింపయ్యుంటుంది. అన్ని హక్కులు కలిపి పుష్ప 2 టార్గెట్ వెయ్యి కోట్ల పైమాటేనట. కేవలం రెండు వారాల గ్యాప్ లో గేమ్ ఛేంజర్ వస్తున్న నేపథ్యంలో మార్కెటింగ్ కీలకం కానుంది.
This post was last modified on September 28, 2024 1:59 pm
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…