బాహుబలి, కెజిఎఫ్, పుష్ప, కాంతార సీక్వెల్స్ కున్న క్రేజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ ఒక సినిమాకు కొనసాగంపు సక్సెస్ ఫుల్ గా ఎలా చేయవచ్చో నిరూపించిన బ్లాక్ బస్టర్ బాలీవుడ్ ధూమ్. ఈ సిరీస్ నుంచి 2004లో మొదటి భాగం వచ్చినప్పుడు ఆడియన్స్ తెరమీద చూపించిన కంటెంట్ కి షాక్ తిన్నారు. పేరుకి అభిషేక్ బచ్చన్ హీరో అయినప్పటికీ విలన్ గా నటించిన జాన్ అబ్రహంకే ఎక్కువ పేరు రావడం చూసి విశ్లేషకులకు నోట మాట రాలేదు. దెబ్బకు ధూమ్ 2లో కోరి మరీ విలన్ గా చేశాడు హృతిక్ రోషన్. అది అంచనాలకు మించి ఆడేసి కనక వర్షం కురిపించింది.
2013 లో రిలీజైన ధూమ్ 3కి ఏకంగా అమీర్ ఖాన్ రంగంలోకి దిగాడు. డ్యూయల్ రోల్ చేయడమే కాక పలు సాహసాలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. కమర్షియల్ గా హిట్టయ్యింది కానీ హైప్ పరంగా పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేకపోయింది. ఇదంతా జరిగి పదకొండు సంవత్సరాలు గడిచిపోయాయి. ధూమ్ 4 కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కానీ నిర్మాత ఆదిత్య చోప్రాది కథ విషయంలో రాజీపడని ధోరణి కావడంతో స్క్రిప్ట్ కోసమే ఏళ్ళ తరబడి ఖర్చు పెట్టారు. ఇప్పుడు దానికి రూటు క్లియరయ్యిందని లేటెస్ట్ అప్డేట్. 2025లో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని సమాచారం.
మెయిన్ లీడ్ గా రన్బీర్ కపూర్ ని దాదాపు లాక్ చేసినట్టు తెలిసింది. ధూమ్ 1, 2కి కథలు ఇచ్చి 3కి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్యతో కలిసి ఆదిత్య చోప్రా స్టోరీని ఒక కొలిక్కి తెచ్చారట. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూపించని యాక్షన్ విజువల్స్ ఇందులో కనిపిస్తాయట. బడ్జెట్ అయిదు వందల కోట్లకు పైమాటేనని అంటున్నారు. అభిషేక్ బచ్ఛన్, ఉదయ్ చోప్రా లాంటి మెయిన్ క్యాస్టింగ్ ని కొనసాగిస్తూ ఈసారి విలన్ గా యానిమల్ హీరోని పెట్టాలనే ఆలోచన మంచిదే. ప్రస్తుతం తను రామాయణం, బ్రహ్మాస్త్ర 2 , లవ్ అండ్ వార్ తో బిజీగా ఉన్నాడు. యానిమల్ పార్క్ పెండింగ్ లో ఉంది.
This post was last modified on September 28, 2024 11:34 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…