రాజమౌళితో సినిమా చేయడం ఏ నటుడికైనా ఒక వరమే. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఇప్పటిదాకా ఆయన అపజయమే ఎరుగలేదు. ‘సై’ సినిమా ఒక్కటి మరీ పెద్ద హిట్ కాలేదు కానీ.. అది కూడా ఫ్లాప్ కాదు. ఇక మిగతా చిత్రాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లు అవుతూ వెళ్లాయి. ఇక బాహుబలితో ఆయన అందుకున్న విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. దీని తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం పాన్ వరల్డ్ లెవెల్లో పెద్ద హిట్ అయింది.
రాజమౌళితో సినిమాలు చేయడం ద్వారా హీరోలు తమ మార్కెట్‌ను ఎంతగానో పెంచుకున్నారు. కానీ అంత వరకు బాగుంది కానీ.. జక్కన్నతో సినిమా చేసిన వెంటనే ఒక ఫెయిల్యూర్ హీరోలను వెంటాడుతుందనే సెంటిమెంట్ మాత్రం మారడం లేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కూడా వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాత్రం వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పరిస్థితి ఏంటా అని అందరూ ఎదురు చూశారు. చరణ్ ప్రత్యేక పాత్ర చేసిన ‘ఆచార్య’ డిజాస్టర్ అయింది. దీంతో అతను శాపం తప్పించుకోలేకపోయాడన్నారు. ఐతే అది చరణ్ సోలో హీరో సినిమా కాదు కాబట్టి దాన్ని లెక్కలోకి వేయొద్దు అన్న వాళ్లు కూడా ఉన్నారు. మరి ‘గేమ్ చేంజర్’ సంగతేంటో చూడాలి.
ఇక తారక్ విషయానికి వస్తే ‘దేవర’తో ఈ జింక్స్‌ను అతను బ్రేక్ చేస్తాడనే అంచనాలు కలిగాయి. ఎట్టకేలకు సినిమా రిలీజైంది. ఐతే సినిమాకు సూపర్ అనే టాకూ లేదు. అదే సమయంలో అస్సలు బాలేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం కావట్లేదు. ఐతే ప్రస్తుతం సినిమా మీద ఒక అంచనాకు రాలేని పరిస్థితి. మంచి హైప్ మధ్య రిలీజ్ కావడం వల్ల వీకెండ్ బుకింగ్స్ అదిరిపోయాయి. వీకెండ్ అయ్యే వరకు సినిమా ఫలితం ఏంటో చెప్పలేం. సోమవారానికి ఒక క్లారిటీ రావచ్చు. ఐతే రాజమౌళి తనయుడు కార్తికేయ మాత్రం తన తండ్రి శాపాన్ని తారక్ అధిగమించాడంటూ ఒక పోస్ట్ పెట్టేయడం విశేషం.
This post was last modified on %s = human-readable time difference 7:15 pm
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న బాలయ్య 109 టైటిల్ టీజర్ ఈ వారమే విడుదల కానుంది. ఉదయం 10…
దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…