టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు గాంచిన స్వర్గీయ శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ మీద మన ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది. శ్రీదేవి ఎన్నో బ్లాక్ బస్టర్స్, క్లాసిక్స్ లో నటించి చెరిగిపోని సంతకం చేయడం పరిశ్రమ ఉన్నంత కాలం గుర్తుండిపోతుంది. అలాంటి దిగ్గజ నటి కూతురంటే సహజంగా అంచనాలు రేకెత్తుతాయి. అందుకే దేవర మీద ఈ విషయంగా సామాన్య జనంలో ఆసక్తి నెలకొంది. వరని ప్రేమించే తంగమ్మగా జాన్వీ నిడివి ఇందులో చాలా పరిమితంగా ఉంది. కాసిన్ని సీన్లు, ఒక పాటతో సర్ధేశారు. తన ఎంట్రీ సెకండాఫ్ లోనే ఉంటుందని కెమెరామెన్ రత్నవేలు ఒక ఇంటర్వ్యూలో ముందే చెప్పేశారు.
పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే జాన్వీ కపూర్ కు దక్కిన కొద్దిపాటి స్పేస్ లో ఎక్కువ జడ్జ్ చేసే అవకాశం దక్కలేదు. ఉన్నంతలో చలాకీగా, అందంగా కనిపించడమే కాక హుషారుగా నటించింది. కాకపోతే తంగం క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం సంతృప్తికరంగా అనిపించలేదు. వరతో ప్రేమ వ్యవహారాన్ని దర్శకుడు కొరటాల శివ అంత మెప్పించేలా చేయలేకపోయారు. దృష్టి మొత్తం యాక్షన్, ఎలివేషన్ మీద పెట్టడంతో హీరో హీరోయిన్ ట్రాక్ కి ప్రాధాన్యం ఇవ్వలేదు. గెటప్ శీను, హిమజ, హరితేజ గ్యాంగుతో కాస్త కామెడీ ట్రై చేశారు కానీ వయోలెంట్ మూడ్ లో ఉన్న జనాలకు అది ఎక్కలేదు.
సో జాన్వీ కపూర్ స్వయంగా చెప్పినట్టు తన స్టామినా బయట పాడేది దేవర పార్ట్ 2లోనే. అయితే ఇది ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఇప్పట్లో తేలదు. ఎందుకంటే వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ పూర్తి చేసే నాటికి ఇంకో రెండేళ్లు గడిచిపోతాయి. ఒకవేళ మరీ లేట్ అయ్యే పక్షంలో వేరే హీరోతో ఇంకో సినిమా తీసి దేవర 2కి వస్తానని కొరటాల శివ ఇటీవలే చెప్పారు. సో ఈలోగా ఆర్సి 16 అయిపోవచ్చు. అంటే జాన్వీని మరోసారి తారక్ కు జోడీగా చూడటానికన్నా ముందు రామ్ చరణ్ తో జట్టు కట్టడాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూడు హిట్ అయితే తన దశ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
This post was last modified on September 27, 2024 12:22 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……