Movie News

హిందీ మార్కెట్ పట్టు దక్కాలంటే

తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ ఊచకోత అనే పదం చిన్నదనిపించేలా జరుగుతున్నాయి కానీ బాలీవుడ్ వైపు ఆశించిన స్థాయిలో లేకపోవడం అభిమానులను కలవర పెడుతోంది. నిజానికి ఇక్కడ టెన్షన్ కన్నా ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నార్త్ ఆడియన్స్ తెలుగు, తమిళం నుంచి వచ్చే ఎంత ప్యాన్ ఇండియా మూవీ అయినా సరే ముందస్తుగా భారీ అంచనాలు పెట్టేసుకోరు. దర్శకుల్లో రాజమౌళి మినహాయించి ఇంకెవరికీ అక్కడ బ్రాండ్ ఇమేజ్ లేదు. కెజిఎఫ్, కాంతారలు క్రమంగా టాక్ తెచ్చుకుని ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కానీ మొదట్లో వచ్చిన ఓపెనింగ్స్ తక్కువే

వీటికన్నా ముందు సైరా నరసింహారెడ్డితో మొదలుపెట్టి మొన్నటి సరిపోదా శనివారం వరకు ఎంత అగ్రెసివ్ మార్కెటింగ్ చేసినా సరే హిందీ నుంచి ఆశించిన ఫలితాలు దక్కలేదు. కానీ పుష్ప 1 ది రైజ్ కేసు విభిన్నం. రెండో వారం అడుగుపెట్టే లోపు మిక్స్డ్ టాక్ కాస్తా బ్లాక్ బస్టర్ గా మారి సీక్వెల్ మీద విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. ప్రభాస్ కు బాహుబలి నుంచి వచ్చిన ఇమేజ్ కవచంలా నిలబడి సాహో నుంచి కల్కి దాకా తిరుగులేని మార్కెట్ సంపాదించిపెట్టింది. ఇది ప్రతి హీరోకు సాధ్యం కాదు. ఇక దేవర విషయానికి వస్తే ఇప్పుడు నెమ్మదిగా కనిపించినా టాక్ పాజిటివ్ వస్తే లెక్కలు మారిపోతాయి.

బాలీవుడ్ జనాల్లో జూనియర్ ఎన్టీఆర్ మీద విపరీతమైన అభిమానం అనలేం కానీ తగినంత ఆసక్తి ఉంది. సరైన హిట్టు పడితే అది కాస్తా పెరిగి సెటిలైపోతుంది. దేవర మీద టీమ్ పెట్టుకున్న నమ్మకం ఇదే. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లాంటి క్యాస్టింగ్ ఉంది కనక సినిమా బాగుందనే మాట బయటికి వస్తే ఖచ్చితంగా భారీ పికప్ ఆశించవచ్చు. పైగా స్త్రీ 2 నలభై రోజుల రన్ పూర్తి చేసుకుని నెమ్మదించింది. ఈ నేపథ్యంలో అక్కడి బాక్సాఫీస్ జోష్ లేదు. ఉత్తరాది మల్టీప్లెక్సుల కోసమే యాభై రోజుల తర్వాత మాత్రమే ఓటిటి రిలీజ్ ఒప్పందం చేసుకున్న దేవర అంత ధీమా ఉంది కాబట్టే అలాంటి నిర్ణయం తీసుకుంది.

This post was last modified on September 26, 2024 11:02 am

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

2 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

4 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

9 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

10 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

10 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

10 hours ago