ఈ ఏడాది తెలుగులో భారీ చిత్రాల సందడి ఆశించిన స్థాయిలో లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ నిరాశపరచగా.. ఆ తర్వాత రిలీజైన ఏకైక పెద్ద చిత్రం ‘కల్కి’నే. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ‘కల్కి’ వచ్చిన రెండు నెలలకు ఇప్పుడు ‘దేవర’ సందడికి రంగం సిద్ధమైంది. ట్రైలర్‌కు మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా హైప్ మీద కాస్త సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ.. రిలీజ్ ముంగిట ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోందీ చిత్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, యుఎస్‌లో అదిరిపోయే ప్రి సేల్స్‌తో దూసుకెళ్తోందీ చిత్రం.
ఇక తెలుగు రాష్ట్రాల వసూళ్లకు ఆయువుపట్టు అనదగ్గ హైదరాబాద్‌లో ‘దేవర’ దూకుడు మామూలుగా లేదు. ఈ శుక్రవారం 95 శాతం థియేటర్లలో ‘దేవర’నే ప్రదర్శించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్సులు కూడా మెజారిటీ షోలను ఈ చిత్రానికే కేటాయించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రి సేల్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘దేవర’ రెండో స్థానానికి ఎగబాకింది. ఈ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందే రూ.13 కోట్ల మేర గ్రాస్ రాబట్టింది. రూ.12.49 కోట్లతో రెండో స్థానంలో ఉన్న ‘సలార్’ సినిమాను అధిగమించింది. ఈ లిస్టులో ‘కల్కి 2898 ఏడీ’ అగ్రస్థానంలో ఉంది. ఆ సినిమా హైదరాబాద్‌లో ప్రి సేల్స్‌తో రూ.18.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ‘దేవర’ రిలీజ్ లోపు ఈ మార్కును అందుకోవడం కష్టమే కావచ్చు. కానీ ‘సలార్’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’, ‘గుంటూరు కారం’ లాంటి సినిమాలను దాటేయడం చిన్న విషయం కాదు.
‘దేవర’ ట్రైలర్‌కు మిక్స్డ్ టాక్ వచ్చాక ఈ స్థాయిలో హైప్ ఉండడం అంటే గొప్ప విషయమే. ఇక డే-1 ఓపెనింగ్స్‌లోనూ ‘దేవర’ సంచలనం రేపేలాగే కనిపిస్తోంది. ఇండియా ఆల్ టైం డే-1 గ్రాసర్స్‌లో టాప్-5లో ఈ సినిమా నిలవడం ఖాయం.
This post was last modified on September 25, 2024 5:04 pm
కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…
225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలవడం.. మేయర్ పదవి మీద గురి పెట్టడం…
హీరో, హీరోయిన్ ఎవరైనా సక్సెస్ ఎక్కువ కాలం లేకపోతే ఆటోమేటిక్ గా రేసులో వెనుకబడటం జరుగుతుంది. అందులోనూ పెళ్ళయిపోతే ఇక…
ఒకే నెలలో రెండు డేట్లు మార్చుకున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 ఫైనల్ గా అక్టోబర్ 30 లాక్ చేసుకున్న…
ఇంకా థియేటర్లలోనే రిలీజ్ కాలేదు. అప్పుడే ఓటీటీలో సినిమాను చూడ్డం గురించి చర్చేంటి అనిపిస్తోందా? ఐతే ‘రామాయణం’ సినిమా మేకర్స్…