ఆరెక్స్ 100తో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఆ తర్వాత మహా సముద్రంతో అంచనాలు అందుకోలేనప్పటికీ మంగళవారం తనలో అసలైన టెక్నీషియన్ ని మరోసారి బయటికి తీసుకొచ్చింది. ఆస్కార్ నామినేషన్లకు పంపాల్సిన లిస్టులో చోటు దక్కించుకోవడం బట్టే విమర్శకులను ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. సీక్వెల్ తీస్తానని అప్పట్లోనే చెప్పిన అజయ్ భూపతి దాని స్క్రిప్ట్ తాలూకు పనులు జరుగుతుండగానే మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు ఫిలిం నగర్ టాక్. అది కూడా ఏకంగా కోలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే విధంగా దక్కడం విశేషం.
చియాన్ విక్రమ్ కొడుకు హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ ఒక భారీ బడ్జెట్ మూవీని లాక్ చేసినట్టు చెన్నై అప్డేట్. కొన్ని నెలల క్రితమే కథ చెప్పి ఒప్పించిన ఈ విలక్షణ దర్శకుడు ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని సమాచారం. మొన్న ధృవ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటన రావాల్సింది కానీ చివరి దశ చర్చలు జరుగుతున్న కారణంగా కొంచెం ఆలస్యమవుతోందని వినికిడి. ఇటీవలి కాలంలో టాలీవుడ్ దర్శకులకు అక్కడ మంచి అవకాశాలు దక్కుతున్నాయి. వంశీ పైడిపల్లి ఏకంగా విజయ్ తో వారసుడు చేయగా, కెవి అనుదీప్ కు పిలిచి మరీ ప్రిన్స్ ఇచ్చాడు శివ కార్తికేయన్.
ప్రస్తుతం ధృవ్ విక్రమ్ కు మంచి మార్కెట్ ఉంది. వేగంగా సినిమాలు చేయకపోయినా తండ్రి చూపించిన బాటలో వెరైటీ కథలను ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందులో భాగంగానే అజయ్ భూపతికి ఎస్ చెప్పి ఉండొచ్చు. సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ కనక అక్కడ డెబ్యూతో ఋజువు చేసుకుంటే స్టార్ హీరోల నుంచి పిలుపు అందుకోవచ్చు. ధృవ్ కోసం ఆరెక్స్ 100 లాంటి కల్ట్ లవ్ స్టోరీ కాకుండా మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథను రాసుకున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు, హీరోయిన్, టెక్నికల్ టీమ్ తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on September 25, 2024 2:54 pm
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…