దేవర.. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ల తర్వాత వస్తున్న సోలో మూవీ. తారక్ సినిమాల ఆడియో వేడుకలు, ప్రి రిలీజ్ ఈవెంట్లు అంటే అభిమానులకు చాలా ప్రత్యేకం. చాలా పెద్ద స్థాయిలో జరుగుతాయి. తారక్ చాలా హార్ట్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా మాట్లాడతాడు. ఈసారి గ్యాప్ చాలా ఎక్కువ వచ్చిన నేపథ్యంలో ‘దేవర’ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా, ఆశగా చూశారు.
తీరా చూస్తే అభిమానులు పరిమితికి మించి రావడంతో నోవాటెల్‌లో ఆదివారం జరగాల్సిన ఈవెంట్‌ను రద్దు చేయక తప్పలేదు. ఈవెంట్ మొదలవడానికి కొన్ని గంటల ముందే అనుమతించిన పరిమితికి మించి ఎన్నో రెట్ల సంఖ్యలో వేదిక వద్దకు అభిమానులు వచ్చేశారు. 4 వేల మందికి అనుమతి ఇవ్వగా.. ఈవెంట్ జరగడానికి ముందు లోపల బయట కలిపి 30-35 వేల మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. అభిమానులను నియంత్రించలేని పరిస్థితుల్లో ఈవెంట్ క్యాన్సిల్ చేయక తప్పలేదు.
ఒక పెద్ద హీరో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఇలా రద్దవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వేడుకలకు వేదికను ఎంచుకోవడంలో, ఏర్పాట్లు చేయడంలో బెటర్ ప్లానింగ్ ఉండాల్సిన అవసరాన్ని ఇది చాటిచెప్పింది. గతంలో తారక్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ దగ్గర ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోవడం, వేరే ఈవెంట్లలో కూడా విషాదాలు చోటు చేసుకోవడం గుర్తుండే ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇకపై పెద్ద హీరోల సినిమాల ఈవెంట్లను వీలైనంత మేర ఓపెన్ గ్రౌండ్లోనే చేయాలనే చర్చ జరుగుతోంది. ‘పుష్ప-2’ విషయంలోనూ తాము అదే చేయబోతున్నట్లు నిర్మాత రవిశంకర్ ప్రకటించారు. ‘దేవర’ ఈవెంట్‌కు తాను కూడా హాజరు కావాల్సిందని.. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో తాము లోపలికి వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని రవిశంకర్ చెప్పారు. తారక్ యుఎస్ వెళ్లిపోతున్న నేపథ్యంలో వేరే ఈవెంట్ చేయడానికి అవకాశం లేకపోయిందని చెప్పిన ఆయన.. ‘దేవర’ ఈవెంట్ విషయంలో జరిగింది తమకు ఒక పాఠమని చెప్పారు. అందుకే ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్ విషయంలో జాగ్రత్త పడతామని.. ఓపెన్ గ్రౌండ్లోనే ఆ వేడుక చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘పుష్ప-2’ డిసెంబరు 6న విడుదల కానుండగా.. నవంబరు చివర్లో ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు.
This post was last modified on September 24, 2024 6:32 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…