Movie News

శనివారం భామకు ఇంకో సూపర్ ఛాన్స్

ఆరేళ్ళ క్రితం నాని గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ డెబ్యూ చేసి ఆ వెంటనే శర్వానంద్ శ్రీకారంలో ఛాన్స్ దక్కించుకున్నప్పటికీ ఆ రెండూ సక్సెస్ కాకపోవడంతో హీరోయిన్ ప్రియాంక మోహన్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఎంచక్కా తమిళంలో సెటిలైపోయింది. శివ కార్తికేయన్ తో వరసగా డాక్టర్, డాన్ రూపంలో రెండు హిట్లు, సూర్య లాంటి స్టార్ సరసన ఈటిలో నటించాక కెరీర్ ఊపందుకుంది. కెప్టెన్ మిల్లర్ లో డిఫరెంట్ పాత్ర దక్కింది కానీ తమిళంలోనే ఏవరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఇతర భాషల్లో ఫ్లాపయ్యింది. కానీ సరిపోదా శనివారం లెక్కలు మార్చేసింది.

రెండోసారి న్యాచురల్ నానికి జోడి కట్టడం బ్లాక్ బస్టర్ అందించింది. ఏకంగా వంద కోట్ల గ్రాసర్ లో భాగమయ్యేలా చేసింది. ఈ చిత్రం నిర్మించిన డివివి బ్యానరే పవన్ కళ్యాణ్ ఓజి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ ప్రియాంక మోహనే హీరోయిన్. కాకపోతే ఇది కొంచెం ఆలస్యమయ్యేలా ఉంది. తాజాగా విశ్వక్ సేన్ సరసన నటించేందుకు ఈ శనివారం భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. జాతిరత్నాలు, ప్రిన్స్ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోయే మూవీలో తననే ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మట.

ఫామ్ లో ఉన్న హీరోయిన్లను ఎంచుకోవడంలో విశ్వక్ సేన్ పాటిస్తున్న స్ట్రాటజీలో వర్కౌట్ అవుతున్నాయి. మెకానిక్ రాకీలో మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. లైలాలో ఆకాంక్ష శర్మని ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రియాంక మోహన్ ని లాక్ చేసుకునే పనిలో ఉన్నారు. గ్యాంగ్ అఫ్ గోదావరి నిరాశ పరచడంతో విశ్వక్ కొత్త తరహా సబ్జెక్టులను ఎంచుకునే పనిలో పడ్డాడు. లైలాలో ఏకంగా అమ్మాయి గెటప్ లో కనిపించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటి జనరేషన్ లో పూర్తి నిడివి లేడీ రోల్స్ చేసినవాళ్లు లేరు. ఇక కెవి అనుదీప్ రాసుకున్న స్టోరీ మాత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని టాక్.

This post was last modified on September 24, 2024 5:19 pm

Share

Recent Posts

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

4 hours ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

5 hours ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

5 hours ago

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ``భౌతికంగా మీరు మాకు…

6 hours ago

‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…

6 hours ago

కన్నడిగుల ఆక్రోశం అర్థరహితం

సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…

6 hours ago