స్టార్ల సినిమాల బడ్జెట్ లు, రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోవడానికి ఓటిటిలు కారణమంటే వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎలాగో దర్శకుడు వెట్రిమారన్ వివరించారు. ఇటీవలే దేవర ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ని అక్కడి మీడియా మీరు ఎవరితో పని చేయాలని కోరుకుంటున్నారని అడిగితే ఈ విలక్షణ దర్శకుడి పేరు చెప్పిన సంగతి తెలిసిందే. విడుదల పార్ట్ 1, విచారణ, వడ చెన్నై, అసురన్ (నారప్ప) లాంటి క్లాసిక్స్ తో ఈయన సంపాదించుకున్న అభిమానం అలాంటిది. ఇతర డైరెక్టర్లతో ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ సందర్భంగా ఒక ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.
రజనీకాంత్, విజయ్ లాంటి పెద్ద హీరోల సినిమాలకు ఓటిటిలు నిర్మాణం మొదలుకాకుండానే 120 కోట్ల వరకు ఇస్తామంటూ ఆఫర్లు చెబుతాయి. దాంతో డిజిటల్ లోనే అంత డబ్బు వస్తున్నప్పుడు పారితోషికం ఎందుకు పెంచకూడదనే ఆలోచన స్టార్లకు రావడం సహజం. దాంతో అమాంతం నాలుగైదింతలు పెంచేస్తున్నారు. ఎలాగూ డబ్బులు వస్తున్నాయనే ధీమాతో నిర్మాతలు ముందు వెనుకా చూడకుండా అడిగినంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఒకవేళ డిజాస్టర్ అయితే తర్వాతి సినిమాకు అంత ఇవ్వలేం అంటూ ఓటిటిలు బేరాలు పెడతాయి. దీంతో ఏర్పాట్లలో ఉన్న ప్రొడ్యూసర్ గుండె గుభేలుమంటుంది.
ఇదంతా వెట్రిమారన్ సవివరంగా ఇచ్చిన విశ్లేషణ. నిజమేగా. కరోనా టైంలో భారీగా హక్కుల కోసం వెచ్చించిన ఓటిటిలు ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలకు చుక్కలు చూపిస్తున్న మాట వాస్తవం. ముందో మాట తర్వాతో మాట మార్చేస్తున్నాయి. కొన్నిసార్లు ఏకంగా థియేటర్ రిలీజ్ డేట్లు నిర్దేశిస్తున్నాయి. మొన్న ఇండిపెండెన్స్ డేకి రిలీజైన ఒక పెద్ద సినిమా కేవలం ఆ ఒత్తిడి కారణంగా హడావిడిగా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడున్నాయి. ఓటిటిలు పరిశ్రమను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో వెట్రిమారన్ ఇంత స్పష్టంగా చెప్పినా పరిస్థితిలో మార్పు రావడం కష్టమే.
This post was last modified on September 24, 2024 5:17 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…