దేవర విడుదల ఇంకో మూడు రోజుల్లో ఉన్న నేపథ్యంలో దీని తాలూకు ఫీవర్ ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. ఫ్యాన్స్ సంబరంగా ఎదురు చూస్తుండగా ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా తారక్ విశ్వరూపాన్ని చూసేందుకు సగటు ప్రేక్షకులు కూడా సిద్ధపడుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొరటాల శివ పలు ఆసక్తికరమైన సంగతులు పంచుకున్నారు. ముఖ్యంగా ఆచార్య రిలీజయ్యాక చిరంజీవికి ఈయనకి ఏవో విభేదాలు వచ్చాయని, ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ దర్శకుడి మీద నింద వేసినట్టుగా వచ్చిన వార్తలు బాగా తిరిగాయి. ఈ విషయంలో డిజాస్టర్ ఫలితానికి మించిన చర్చ జరిగింది.
దానికి ఈ రోజు చెక్ పెట్టేశారు కొరటాల శివ. రిలీజై ఫలితం వచ్చిన టైంలో చిరంజీవి వెంటనే ఫోన్ చేసి నువ్వు బలంగా కంబ్యాక్ అవుతావని చెప్పారని, అది బయటికి తెలియకపోవడంతో తనను ఆయన ఏదో అన్నట్టుగా ప్రచారం చేశారని వివరణ ఇచ్చారు. అంతే కాదు ఆచార్య ఫ్లాప్ ప్రభావం తన మీద ఎంత మాత్రం లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఒక ప్రధాన అపోహను తొలగించినట్టయ్యింది. స్టార్ హీరోలకు ఇలాంటి పరాజయాలు కొత్తేమి కాదు కానీ ఆచార్య విషయంలో కాస్త ఎక్కువ డిస్కషన్, ట్రోలింగ్ జరిగింది. దాన్ని క్లియర్ చేసే అవకాశం మీడియా ముఖంగా కొరటాలకు దొరకలేదు.
ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. ఆ గాయం పూర్తిగా మానిపోయేలా దేవర ప్రతి ఒక్కరిని అలరిస్తుందని భరోసా ఇస్తున్నారు. నెరేషన్ ఇవ్వడానికే నాలుగు గంటలు పట్టినందువల్లే ఇంత మంచి కథను హడావిడి పడకూడదని గుర్తించి రెండు భాగాల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంచనాలు పీక్స్ లో ఉన్న వేళ దర్శకుడిగా కొరటాల చెబుతున్న మాటలు మంచి ఎలివేషన్లు ఇస్తున్నాయి. తన డెబ్యూ మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్ తో చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న కొరటాల శివ దేవర రెండో భాగం పూర్తి చేశాక ఈ కాంబోని రిపీట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
This post was last modified on September 24, 2024 12:42 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…