ఒకటి రెండు కాదు 24 వేల డాన్స్ మూమెంట్లు. 156 సినిమాలు. 537 పాటలు. మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్ అఫ్ ఇండియన్ సినిమాగా గిన్నిస్ బుక్కు అందించిన రికార్డు చూస్తే భవిష్యత్తులో దీన్ని తిరగరాయడం ఎవరి వల్ల కాదని బల్లగుద్ది చెప్పేయొచ్చు. ఎందుకంటే ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైన ఇప్పటి జనరేషన్ ప్యాన్ ఇండియా హీరోలు 100 మార్కు అందుకోవడం అసాధ్యం. సీనియర్లలో చిరు, బాలయ్య, నాగ్ లకు మాత్రమే ఈ ఫీట్ సాధ్యం కాగా వెంకటేష్, రవితేజ ఇటీవలే 75 మైలురాయి అందుకున్నారు. ఇక ప్రభాస్ తో సహా టయర్ వన్ హీరోలందరూ యాభై దాటితే అద్భుతమే అనుకోవాలి.
ఈ నేపథ్యంలో చిరంజీవికి ఈ రికార్డు చాలా ప్రత్యేకంగా నిలవబోతోంది. టాలీవుడ్ తరఫున ఈ ఘనతని అతి కొద్దిమందే అందుకున్నారు. రామానాయుడు, విజయనిర్మల కాలం చేయగా వెయ్యికి పైగా సినిమాల అప్రతిహత రికార్డుని దక్కించుకున్న బ్రహ్మానందంతో పాటు ఇప్పుడు మెగాస్టార్ ఈ లిస్టులో తోడయ్యారు. ఒకప్పుడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకి చాలా ఖ్యాతి ఉండేది. దూరదర్శన్ ఛానెల్ లో ప్రతి వారం ఈ పుస్తకం మీద వచ్చే ప్రోగ్రాం కోసం జనం ఎగబడి ఎదురు చూసేవారు. ప్రింట్ రూపంలో దొరికే కాపీలకు మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు అంత విరివిగా అందుబాటులో లేవు.
తనతో పని చేసిన సీనియర్ దర్శకులు, నిర్మాతలు, కుటుంబ సభ్యుల నడుమ అమీర్ ఖాన్ చేతుల మీద చిరంజీవి అందుకున్న గిన్నిస్ రికార్డు ఈ ఏడాదిలోనే రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పద్మవిభూషణ్ వచ్చిన ఏడాదే ఇదీ జరగడం వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. 46 సంవత్సరాల నట ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించిన చిరంజీవికి ఈ గిన్నిస్ రికార్డు మరో కంఠాభరణం అయ్యింది. పాతిక రోజులుగా కొంత అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి ఇది ముందే ప్లాన్ చేసిన ఈవెంట్ కావడంతో అలాగే హాజరయ్యారని సన్నిహితుల సమాచారం.
This post was last modified on September 23, 2024 9:27 am
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…