Movie News

ఈవెంట్ రద్దు – ఒక మేలుకొలుపు

నిన్న సాయంత్రం హైదరాబాద్ నోవాటెల్ లో తలెపెట్టిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం ఊహించని పరిమాణం. దాని తాలూకు బాధ తర్వాత వీడియో రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మొహంలో స్పష్టంగా కనిపించగా, నిరాశగా వెనుదిరిగిన వేలాది అభిమానులు ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా తారక్ చేస్తున్న సినిమా జ్ఞాపకాన్ని ఇలా చేదుగా మారిపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఒక మేలుకొలుపుగా చూడాల్సిన అవసరం చాలా ఉంది. గరిష్టంగా 5 నుంచి 8 వేల మందికి మాత్రమే వసతి ఇవ్వగల చోట దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీ ఈవెంట్ ని ప్లాన్ చేయకుండా ఉండాల్సింది.

పాసులు పరిమితంగా ఇచ్చినా, లిమిట్ దాటించినా ఫ్యాన్స్ లెక్కకు మించి వస్తారనేది ఓపెన్ సీక్రెట్. గతంలోనూ ఇంత కన్నాభారీ వేడుకలు జరిగాయి. ప్రభాస్ ఈవెంట్లను రామోజీ ఫిలిం సిటీ, తిరుపతి లాంటి ప్రాంతాల్లో జరిపినప్పుడు చిన్న చిన్నవి మినహాయించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ దేవర కేసు వేరు. అభిమానుల ఉద్వేగం పతాక స్థాయిలో ఉంది. అది ఎంత మోతాదులో ఉందనేది గుర్తించి ఉంటే అసలు నోవాటెల్ లో చేయాలనే ఆలోచనే వచ్చేది కాదు. పోనీ ఎల్బి స్టేడియం లాంటిది ఎంచుకున్నా బాగుండేదేమో కానీ వివిధ కారణాల వల్ల చిన్న స్టేజిని ఎంచుకోవడం దీనికి దారి తీసింది.

నాలుగు రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇంకో వేడుక సాధ్యపడదు. బియాండ్ ఫెస్ట్ లో స్క్రీనింగ్ కోసం తారక్ విదేశాలకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక కష్టం. పోనీ ఇప్పటికిప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలన్నా విపరీతమైన ఒత్తిడి మధ్య జరిగే పని కాదు. రిలీజయ్యాక సక్సెస్ మీట్ లాంటిది పెడితే ఫ్యాన్స్ లో అసంతృప్తిని చల్లార్చగలం. అప్పుడు కూడా ఇన్ డోర్ కాకుండా ఏదైనా ఓపెన్ వెన్యూ ఎంచుకుంటే మంచిదనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు తప్పు నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్స్ ది కాదు. ఊహించని స్థాయిలో పరిస్థితులు అలా తిరగబడినప్పుడు ఎవరైనా చేయగలిగింది ఏముంది.

This post was last modified on September 23, 2024 9:23 am

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

47 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago