ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇండియా లెవెల్లో కూడా అతడిది టాప్ రేంజే. ఇటు తమిళంలో, అటు తెలుగులో అతను భారీ చిత్రాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాకూ మ్యూజిక్ పేలిపోతోంది. కొన్ని సినిమాల మ్యూజిక్ విషయం మిశ్రమ స్పందన వచ్చినా.. తన పాటులు అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘దేవర’ విషయంలోనూ అదే జరిగింది.
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘వేట్టయాన్’ నుంచి ఈ మధ్యే మనసిలాయో అంటూ ఓ పాట లాంచ్ చేస్తే అది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. రజినీకాంత్ అంటే అనిరుధ్‌కు ఎంత ప్రేమ అన్నది తన సంగీతంలో తెలుస్తుంది. అలాగే స్టేజ్ మీద కూడా తన ప్రేమను బలంగా చాటుతాడు.
రజినీ సినిమాల ఆడియో వేడుకల్లో అతను ఇచ్చే లైవ్ షోలు, రజినీ గురించి మాట్లాడే మాటలు చూస్తే మామ మీద తనది మామూలు ప్రేమ కాదు అనిపిస్తుంది. రజినీ భార్య లతకు సోదరుడి కొడుకే అనిరుధ్. ఐతే మామ అనే కాక నటుడిగా రజినీకి అనిరుధ్ వీరాభిమాని. ఆ విషయాన్ని ఎన్నోసార్లు చాటుకున్నాడు. మాటలతోనే కాక సంగీతంతోనూ అది చూపిస్తుంటాడు. ‘వేట్టయాన్’ ఆడియో వేడుకలో అనిరుధ్ సందడి మామూలుగా లేదు. పాటలతో హోరెత్తించడమే కాక.. స్పీచ్‌తోనూ అందరి దృష్టినీ ఆకర్షించాడు.
తాను బేసిగ్గా జాలీ టైప్ అని అందరికీ తెలుసని.. కానీ రజినీ సినిమాకు సంగీతం అందిస్తున్నపుడు, ఆయన సినిమాలు చూస్తున్నపుడు ఎమోషనల్ అయిపోతానని అనిరుధ్ చెప్పాడు. ‘జైలర్’ మూవీకి బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నపుడు తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పాడు. ఎప్పటికీ తాను సూపర్ స్టార్‌కు డైహార్డ్ ఫ్యాన్‌గానే ఉంటానని.. ఒక అభిమానిగానే ఆయన సినిమాలకు సంగీతం అందిస్తానని అన్నాడు. అనిరుధ్ మీద రజినీ సైతం ప్రత్యేక ప్రేమనే చాటుకున్నాడు ‘వేట్టయాన్’ ఆడియో వేడుకలో. ఈ చిత్రం అక్టోబరు 10న దసరా కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2024 12:22 am
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…