Movie News

టికెట్ రేట్లకు పాజిటివ్ టాక్ తోడైతే

ఊహించినదాని కన్నా ఎక్కువగా ఏపీలో దేవరకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చేశారు. ఆ మేరకు అధికారిక జిఓ విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగవంశీ తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లు పెట్టారు.

ప్రతి టికెట్ పై సింగల్ స్క్రీన్లకు 110, మల్టీప్లెక్సులకు 135 రూపాయలు పెంచుకుని తొమ్మిది రోజుల పాటు అమలు చేసుకోవచ్చు. మొదటిరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే షోలు వేసుకునే వెసులుబాటు ఇవ్వగా రెండో రోజు నుంచి రోజుకు 5 షోలు వేసుకునేలా పర్మిషన్లు వచ్చాయి. చెప్పాలంటే కల్కి 2898 ఏడి కంటే ఎక్కువ హైక్ రావడం గమనించాల్సిన విషయం.

సో రికార్డులకు గ్రౌండ్ సెట్ అయ్యింది. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం నెంబర్లు భారీగా ఉండబోతున్నాయి. మిడ్ నైట్ షోలు కాబట్టి తెల్లవారేలోపు సినిమా ఎలా ఉందనే దాని మీద మీడియా, సామజిక మాధ్యమాలు హోరెత్తిపోతాయి. ఏదైనా సరే నిమిషాల్లో వైరల్ కావడం ఖాయం.

దేవర టీమ్ నమ్మకానికి తగినట్టే డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ షోలను ప్లాన్ చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా తారక్ కి ఇంత గ్యాప్ రావడం కెరీర్ లోనే మొదటిసారి. పలు కేంద్రాల్లో ఊళ్ళో ఉన్న అన్ని స్క్రీన్లలో దేవరనే ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారంటే హైప్ అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు మిగిలింది ప్రేక్షకుల అంచనాలు అందుకోవడమే. గత డిజాస్టర్ నుంచి దర్శకుడు కొరటాల శివ పూర్తిగా కోలుకుని కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ చూపిస్తున్నారు. తిరుమల వెళ్లి ఏడుకొండల వాడి దర్శనం చేసుకున్నారు.

ఎలాంటి టెన్షన్ లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేసుకోవడంతో కంటెంట్ డెలివరీ వేగంగా జరిగిపోతోంది. ఓవర్సీస్ షోలలో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూస్తూనే ఉన్నాం. తెలంగాణ జిఓ సైతం ఏ క్షణమైనా రావొచ్చు. ఎప్పుడు ఇచ్చే పెంపు తప్ప ప్రత్యేకంగా ఉండకపోవచ్చు.

This post was last modified on September 21, 2024 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ కల్తీ..వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

తిరుపతి లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన…

30 mins ago

కల్కి 2 పేరు మారుతుందా

ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో టాప్ వన్ గా నిలబడిన…

41 mins ago

తిరుమలలో భక్తులను జగన్ దోచుకున్నారు: రఘురామ

జగన్ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అనేక చర్యలు జరుగుతున్నాయని ఆనాడు ఆ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు…

1 hour ago

చంద్రబాబుపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. జగన్ పాలనలో అతలాకుతలమైన రాష్ట్రానికి…

2 hours ago

లడ్డూ వివాదంతో రాజస్థాన్ సీఎం అలర్ట్

హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, నెయ్యి కలిపారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది…

4 hours ago

ఆదిమూలం రేప్ కేసులో బిగ్ ట్విస్ట్

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి తనపై ఆదిమూలం…

5 hours ago