నిశ్శబ్ధం చిత్రం ఓటిటి ద్వారా విడుదల అవడం అనుష్కకు అస్సలు ఇష్టం లేదట. తాను చేసిన సినిమాలను జనం మధ్య కూర్చుని థియేటర్లలో చూడడం అలవాటని, ఆ అనుభూతిని మిస్ అవడానికి అసలు మనసు రాలేదని అనుష్క చెప్పింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి అనుష్క మొదట్లో అభ్యంతరం చెప్పిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు అనుష్క స్టేట్‍మెంట్‍ని బట్టి అది నిజమేననిపిస్తోంది. అయితే నిర్మాత శ్రేయస్సు కోరి వారికి ఇది లాభదాయకం అవుతుంది కనుక తప్పడం లేదని, నిశ్శబ్ధం చిత్రం కోసం నటిగా చాలా కష్టపడ్డానని అనుష్క చెప్పింది.
ఈ చిత్రంలో మూగ పాత్ర పోషించిన అనుష్క సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం రెండు నెలల పాటు శిక్షణ తీసుకుందట. సైన్ లాంగ్వేజ్ అంత ఈజీగా అర్థం కాలేదని, చాలా కష్టపడి నేర్చుకుని పాత్రకు న్యాయం చేసాననే భావిస్తున్నానని చెప్పింది. ఈ చిత్రంలో మాధవన్ క్యారెక్టర్ సర్‍ప్రైజ్ చేస్తుందని, అతనితో నటించడం ఎంజాయ్ చేసానని అనుష్క తెలియజేసింది. అలాగే ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో సీతగా నటిస్తోందనే రూమర్లను అనుష్క కొట్టి పారేసింది. ఆ చిత్రం కోసం తననెవరూ సంప్రదించలేదని, కానీ ఆ చిత్రం తెరపై చూడాలని చాలా మందిలా తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు చెప్పింది.
This post was last modified on September 30, 2020 1:34 am
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…