దసరా తర్వాత వంద కోట్ల గ్రాస్ సాధించిన నాని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే 25 అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి వచ్చేస్తుంది.
థియేటర్ రిలీజైన సరిగ్గా ఇరవై ఎనిమిది రోజుల (నాలుగు వారాలు) కు ఇంత పెద్ద హిట్ మూవీ స్మార్ట్ స్క్రీన్ పైకి రావడం విశేషమే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాకు జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఓటిటి, థియేటర్ మధ్య గ్యాప్ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న టైంలోనే ఇలా కొత్త సినిమాలు వచ్చేస్తుండటం గమనార్హం. అయితే ఇవి షూటింగ్ టైంలోనే చేసుకున్న అగ్రిమెంట్లు కాబట్టి ఇప్పటికిప్పుడు మార్చలేరు కానీ భవిష్యత్తులో రాబోయే కొత్త సినిమాలకు ఏమైనా మార్పులు తీసుకొస్తారేమో చూడాలి.
సలార్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ లాంటివన్నీ ఇలా 28 రోజులకే డిజిటల్ లో రాగా హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ రెండు నెలల తర్వాత గాని ఓటిటిలో దర్శనం కాలేదు. హిందీలో ఖచ్చితంగా ఎనిమిది వారాల నిబంధన పాటించేలా మల్టీప్లెక్సులు చేసిన ఒత్తిడి అక్కడ మంచి ఫలితాలు ఇచ్చింది.
ఇక సరిపోదా శనివారంకు నెట్ ఫ్లిక్స్ లో మిలియన్ల వ్యూస్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగులో భారీగా తమిళంలో చెప్పుకోదగ్గ రెవిన్యూ తెచ్చిన ఈ సినిమాకు హిందీలో ఆదరణ దక్కలేదు. స్త్రీ 2 తాకిడిలో నిలవలేకపోయింది.
అక్కడి ప్రేక్షకులు ఖచ్చితంగా ఓటిటిలో లుక్ వేస్తారు. ముఖ్యంగా నాని, ఎస్జె సూర్యల మధ్య జరిగే క్లాష్ కు మంచి స్పందన ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా వ్యూస్ సాధించిన తెలుగు సినిమాల్లో హాయ్ నాన్న టాప్ 1గా ఉంది. దసరా సైతం టాప్ 10లో చోటు దక్కించుకుంది. అందుకే నాని సినిమాల మీద ఈ సంస్థకు భారీ నమ్మకం.
This post was last modified on September 21, 2024 11:20 am
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…