సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైభీమ్ దర్శకుడు టీజె జ్ఞానవేల్ రూపొందించిన వెట్టయన్ అక్టోబర్ 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇరవై రోజుల ముందే తమిళంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో రజని యమా హుషారుగా కనిపించారు. అనిరుద్ రవిచందర్ తో కలిసి మనసిలాయో పాటకు డాన్స్ చేయడం వైరలయ్యింది. ప్రీవ్యూ పేరుతో చిన్న టీజర్ రిలీజ్ చేశారు. అమితాబ్, రానా, మంజు వారియర్, ఫాహద్ ఫాసిల్ పాత్రలకు సంబంధించిన లుక్స్ వీడియోలో పొందుపరిచారు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఇక అసలు టాపిక్ కు వద్దాం.
క్యామియో కాబట్టి లాల్ సలామ్ మినహాయిస్తే జైలర్ తర్వాత రజని చేస్తున్న మూవీగా వెట్టయన్ మీద విపరీతమైన అంచనాలున్నాయి. దాన్ని మించిన హీరోయిజం, ఎలివేషన్లు ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. నిజానికి ఈ పోలిక చాలా ప్రమాదం. ఎందుకంటే జ్ఞానవేల్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజజీవిత ఎన్ కౌంటర్ ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు. నలుగురు పోలీస్ ఆఫీసర్లు ఘోరమైన నేరాలు చేసిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తుంటారు. దీంతో సీరియసైన ప్రభుత్వం ఒక కమిటీ వేసి విచారణకు పిలుస్తుంది. ఈ క్రమంలో జరిగే సంఘటనలే వెట్టయన్ కు మూలం.
గతంలో షూటవుట్ అట్ లోఖండ్ వాలా అనే బాలీవుడ్ మూవీ వచ్చింది. ఇప్పుడీ వెట్టయన్ లో దాని షేడ్స్ ఉంటాయని ఇన్ సైడ్ టాక్. వెంకటేష్ ఘర్షణ ఛాయలను కూడా చూడొచ్చని అంటున్నారు. బాషా, నరసింహ, జైలర్ రేంజ్ లో ఏదేదో ఊహించుకోకుండా వస్తే వెట్టయన్ ఆశ్చర్యపరుస్తాడని యూనిట్ అంటోంది. నిన్న రజని తన ప్రసంగంలో చూచాయగా ఇదే చెప్పారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న వెట్టయన్ లో మరోసారి రజని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కాకపోతే రిటైర్ అయినట్టు కాకుండా మధ్య వయసుకొచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చూపించబోతున్నారు.
This post was last modified on September 21, 2024 10:18 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…